టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ: 40 మంది కమిషన్ సభ్యులకు సిట్ నోటీసులు, కీలక విషయాలు
టీఎస్‌పీఎస్సీ కమిషన్‌లోని దాదాపు 40 మంది సిబ్బందికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ కమిషన్లో మొత్తం 10 మంది ఉద్యోగులు పరీక్షరాసినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంలో 9 మంది నిందితులను అదుపులోకి తీసుకుని అధికారులు ప్రశ్నిస్తున్నారు. వారి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కాల్‌డేటాను పరిశీలించారు. పరీక్ష నిర్వహించిన సమయంలో ఎక్కువగా ఎవరెవరితో మాట్లాడారనే విషయాన్ని తెలుసుకుని వారందరికీ జారీ చేశారు.
కాగా, టీఎస్‌పీఎస్సీ కమిషన్‌లోని దాదాపు 40 మంది సిబ్బందికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ కమిషన్లో మొత్తం 10 మంది ఉద్యోగులు పరీక్షరాసినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. అయితే, గ్రూప్-1 పరీక్ష రాసిన ఉద్యోగులతోపాటు మిగిలిన వాళ్లకు కూడా నోటీసులు అందించారు. ఈ గ్రూప్-1 పేపర్ లీకేజీతో నిందితులు బాగానే లబ్ధి పొందినట్లు సిట్ బృందం అనుమానం వ్యక్తం చేస్తోంది.

పేపర్-1 పేపర్ లీకేజీ విజయవంతంగా చేసిన తర్వాతనే ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ఇతర పేపర్లను లీక్ చేసినట్లు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పేపర్ లీకేజీలో అన్నింటికన్నా ఏఈ ప్రశ్నపత్రం లీక్ తోనే భారీగానే లబ్ధిపొందినట్లు ఆధారాలు సేకరించారు. ఈ విధంగా నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తుంటే.. కీలక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయిన సిట్ అధికారులు తెలిపినట్లు సమాచారం.
మరోవైపు, మరో నిందితురాలు రేణుక, ఢాక్యా నాయక్‌లు పలువురు పోటీ పరీక్షల అభ్యర్థులతోపాటు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులతో మాట్లాడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో రేణుకా కాల్ డేటా ఆధారంగా అభ్యర్థులతోపాటు కోచింగ్ సెంటర్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చే ఆలోచనలో సిట్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, రేణుక, ఢాక్యా నాయక్ దంపతుల బ్యాంకు ఖాతాలను కూడా అధికారులు పరిశీలించినట్లు సమచారం. గత కొంతకాలంగా జరిగిన లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో 9 మంది నిందితుల ఐదో రోజు కస్టడీ ముగిసింది.












Click it and Unblock the Notifications