టీఎస్ఆర్టీసీ సమ్మె, మూసివేయడానికి ఆర్టీసీ ప్రభుత్వ జాగీరు కాదు : అశ్వధ్దామ రెడ్డి
ఆర్టీసీ సంస్థపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను జేఏసీ కన్వినర్ అశ్వథ్దామ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆర్టీసీ ప్రభుత్వ జాగీరు కాదని ఆయన అన్నారు. ఆర్టీసీకి ముగింపు ఉండదని, ప్రజలు ఎవ్వరికి ముగింపు పలుకుతారో త్వరలో తేలుతుందని అన్నారు.సీఎం మాట్లాడిన విధానంతో కార్మికుల మనోభావాలు దెబ్బతింటాయని తీవ్రంగా మండిపడ్డారు. ఆయన మాటలు కార్మికులు ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా ఉన్నాయని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్టీసీ అనేది ప్రభుత్వ జాగీరు కాదని ఈ సంధర్భంగా అన్నారు.
ఇక ఆర్టీసీ యూనియన్లు, కార్మికులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు రోడ్డుమీదకు రావడంతోనే ప్రజలు మద్దతుగా నిలిచారని అన్నారు. ఉద్యమ నాయకుడిగా తీర్చిదిద్దింది యూనియన్‌లే అనే విషయాన్ని కేసీఆర్ మరిచిపోవద్దని అన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే... కరీంనగర్ సభలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారని , నువ్వు ఇచ్చిన మాటలే తప్పితే ప్రజలు జవాబు చెబుతారని అన్నారు.

ఆర్టీసీ సమస్యపై సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఆర్టీసీని ఎవ్వరు వచ్చినా కాపాడే పరిస్థితి లేదని అన్నారు. కార్మికులు అసంబద్ద కోరికలు కోరుతున్నారని ఆయన మండిపడ్డారు. ఆర్టీసీని రానున్న రోజుల్లో మూసివేసే పరిస్థితి ఉందని చెప్పారు. ఇదంతా ఆర్టీసీ యూనియన్ నాయకుల వ్యవహారశైలి వల్ల జరుగుతుందని ఆయన మండిపడ్డారు. కోర్టు తీర్పు తర్వాత ఆర్టీసీ భవిష్యత్ తేలనుందని అన్నారు.












Click it and Unblock the Notifications