ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం, ఇద్దరి ప్రాణాలు బలి,
వాహన యజమానుల నిర్లక్ష్యమే సగం ప్రమాదాలకు కారణం, ముందు వెనకాల ఎవరు ,ఏ వాహనం వస్తుందనే కనీస ఆలోచన లేకుండా వాహనాలు నడుపుతారు, వాళ్ల నిర్లక్ష్యంతో ఇతరులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోతారు. ప్రస్థుతం హైదరాబాద్ లో ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలిగొన్నాడు.

హైదరాబాద్ లోని ఐడిఏ బోల్లారం మున్సిపాలిటి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతో ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే బొల్లారం మున్సిపల్ కార్యాలయం ముంది ఓ ఫోర్ వీలర్ టాటా ఏస్ నిలబడి ఉంది. కాగా వెనక నుండి టూ వీలర్ పై సైదిరెడ్డి, 32, లక్ష్మీ ఇద్దరు వెళుతున్నారు. దీంతో వారిని గమనించకుండా ముందు డోర్ తెరిచాడు ఆటో డ్రైవర్ . దీంతో డోర్ తగిలి పక్కనే రోడ్డుపై పడిపోయారు , ఆ వెంటనే టిప్పర్ వచ్చి ఇద్దరి పై నుండి వెళ్లింది. దీంతో వారు అక్కడికక్కడే మరణించారు.












Click it and Unblock the Notifications