బీజేపీకి అంత సీన్ లేదు.. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమన్న ఉత్తమ్
హైదరాబాద్ : తెలంగాణ గట్టు మీద అధికారం కంటే ప్రతిపక్షంపైనే ప్రధాన రాజకీయ పార్టీలు ఫోకస్ చేశాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతుండగా .. ప్రతిపక్ష పాత్ర తమదేనని కాంగ్రెస్, బీజేపీ పోటిపడుతున్నాయి. సీఎల్పీ .. టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనమవడంతో ... బీజేపీ నేతలు స్వరం పెంచారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు కూడా కౌంటర్ అటాక్ చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి విజయవకాశాలు లేవని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హిందు-ముస్లింలను విభజించి రాజకీయం చేయాలని బీజేపీ చూస్తుందని విమర్శించారు. మిగతా చోట్ల మాదిరిగా తెలంగాణలో అది సాధ్యం కాదని తేల్చిచెప్పారు. బీజేపీలో చేరే వారు ఎవరూ లేకపోయపోయిన ప్రచార ఆర్బాటం మాత్రం మెండుగా ఉందని విమర్శించారు.

తెలంగాణ కోసం బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం తప్పదని జోస్యం చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు జరిగిన కాంగ్రెస్ పార్టీ సిద్దమని స్పష్టంచేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీని ఓడించే సత్తా తమకే ఉందని .. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులతో విజయం తథ్యమని తేల్చిచెప్పారు. టీ పీసీసీ చీఫ్ మార్పు ఏఐసీసీ పరిశీలనలో లేదని రాష్ట్ర కాంగ్రెష్ ఇంచార్జీ కుంతియా స్పష్టంచేశారు. మున్సిపల్ ఎన్నికలు, హుజూర్ నగర్ ఉఫ ఎన్నిక, సభ్యత్వ నమోదు అంశాలపై ఫోకస్ చేస్తున్నామని పేర్కొన్నారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications