హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘వందే భారత్’ తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుక: తొలిరోజు 22 స్టేషన్లలో స్టాప్స్!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుకగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభమవుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమవుతుందని తెలిపారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఐదు వందేభారత్ రైళ్లను ప్రారంభించడం జరిగిందన్నారు.

‘వందే భారత్‌'ను ఢిల్లీ నుంచి ప్రారంభించనున్న మోడీ

‘వందే భారత్‌'ను ఢిల్లీ నుంచి ప్రారంభించనున్న మోడీ

సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ఆదివారం సంక్రాంతి పర్వదినం రోజున ప్రారంభమయ్యే రైలు ఆరోవదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. దేశ వ్యాప్తంగా 100 వందేభారత్ రైళ్లను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి వందేభారత్ రైలును ప్రారంభిస్తారని తెలిపారు. ప్రొటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ సహా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలను ఆహ్వానించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.

ఆదివారం ఉదయం 9గంటలకు వందే భారత్ ప్రారంభం

ఆదివారం ఉదయం 9గంటలకు వందే భారత్ ప్రారంభం

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం ఉదయం 9గంటలకు సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై విశాఖపట్నం చేరుకుంటుందని కేంద్రమంత్రి తెలిపారు. వందే భారత్ ఎక్స్ ‌ప్రెస్ రైలు సికింద్రాబాద్ నుంచి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం స్టేషన్లలో ఈ ట్రైన్‌కు హాల్టింగ్ సౌకర్యం కల్పించామని కిషన్ రెడ్డి వెల్లడించారు.

తొలిరోజు 22 స్టేషన్లలో ఆగనున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్

తొలిరోజు 22 స్టేషన్లలో ఆగనున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్

అయితే, ఆదివారం ఒక్కరోజు మాత్రం 22 రైల్వే స్టేషన్లలో ఆగుతుందన్నారు. అందరికీ పరిచయం కోసమే అన్ని రైల్వే స్టేషన్లలో ఆపుతున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి కానుకగా పండగ రోజున వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు తెలిపారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

ఆదివారం మినహా వారంలో 6 రోజులూ వందేభారత్ సేవలు

ఆదివారం మినహా వారంలో 6 రోజులూ వందేభారత్ సేవలు

కాగా, ఈ వందేభారత్ రైలు 16వ తేదీ అంటే సోమవారం నుంచి ప్రయాణికులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఆదివారం మినహా వారంలో ఆరు రోజుల పాటు ఈ రైలు ప్రయాణికులకు సేవలందిస్తుంది. విశాఖ నుంచి బయలుదేరే వందే భారత్‌ రైలు (రైలు నంబర్‌ 20833) ప్రతి రోజూ ఉదయం 5:45 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. అంటే కేవలం ఎనిమిదిన్నర గంటల్లో విశాఖ నుంచి హైదరాబాద్‌ చేరుకోవచ్చు. ఇక, తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో (రైలు నంబర్‌ 20834) మధ్యాహ్నం 3గంటకు ప్రారంభమై.. రాత్రి 11:30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. మధ్యలో వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది. వందే భారత్‌ రైల్లో మొత్తం 16 బోగీలు ఉంటాయి. ఇందులో 14 ఏసీ చైర్‌ కార్లు కాగా, రెండు బోగీలు ఎగ్జిక్యూటివ్‌ ఏసీ కార్‌ కోచ్‌లు. ఎగ్జిక్యూటివ్‌ ఏసీ కార్‌ కోచ్‌లో 104 సీట్లు ఉంటాయి. ఇక ఎకానమీ క్లాస్‌లో 1,024 సీట్లు ఉంటాయి. ఈ రైలులో ఒకేసారి 1,128 మంది ప్రయాణం చేయొచ్చు.

English summary
Vande Bharat express is Sankranti gift for telugu people: Kishan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X