హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ థార్ కారు ఎవరిదీ..? మీర్జా ఎమ్మెల్యే షకీల్ దోస్తేనా..? కారులో అతని కుమారుడు..?

|
Google Oneindia TeluguNews

జూబ్లీహిల్స్‌లో జరిగిన కారు ప్రమాదం కలచివేసింది. అక్కడికక్కడే చిన్నారి మృతిచెందడం ప్రతీ ఒక్కరినీ కలచివేస్తోంది. అయితే ఆ కారు బోధన్ ఎమ్మెల్యే షకీల్‌ది అని.. అందులో అతని కుమారుడు కూడా ఉన్నాడని విశ్వసనీయ సమాచారం. కానీ షకీల్ మాత్రం తనకేదీ తెలియదని అంటున్నారు. ఆ కారు కూడా తనది కాదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. విచారణలో నిజ నిజాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది.

 థార్ కారు..

థార్ కారు..

మహీంద్రా థార్ కారు ఎమ్మెల్యే షకీల్‌దేనని పోలీసులు భావిస్తున్నారు. మీర్జా ఇన్‌ఫ్రా పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయింది. మీర్జా ఇన్‌ఫ్రాలో బిజినెస్‌ పార్ట్‌నర్‌గా ఉన్న ఎమ్మెల్యే షకీల్ నిజామాబాద్‌లో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కారు తనది కాదని గురువారం షకీల్ వివరణ కూడా ఇచ్చాడు. స్టిక్కర్ వేరే ఫ్రెండ్‌కు ఇచ్చానని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ కారు షకీల్‌దేనని దాదాపుగా నిర్ధారణ అయింది

రోడ్ నంబర్ 45

రోడ్ నంబర్ 45


జూబ్లీహిల్స్‌లో జరిగిన ప్రమాదంలో చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. దుర్గం చెరువు నుంచి వేగంగా వస్తున్న కారు రోడ్‌ నంబర్‌ 45 ఢివైడర్‌ను ఎక్కి చెట్టును ఢీ కొట్టింది. రోడ్‌ దాటుతున్న బెలూన్స్‌ అమ్ముకునే వారి పైకి దూసుకెళ్లింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో రెండేళ్ల బాలుడు స్పాట్‌లోనే చనిపోగా, ఇద్దరు గాయపడ్డారు. బాధితులను మహారాష్ట్రకు చెందినవారీగా గుర్తించారు. క్షతగాత్రులను అస్పత్రికి తరలించారు. ఆ తర్వాత డ్రైవర్‌ పరారయ్యాడు. బాధితులు 20 మీటర్ల దూరంలో ఎగిరి పడ్డారంటే కారు ఎంత వేగంగా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

మీర్జా నడిపాడా..? లేక

మీర్జా నడిపాడా..? లేక


బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అహ్మద్‌ అనుచరుడు మీర్జా కారు నడిపినట్లు తెలుస్తోంది. కానీ అందులో షకీల్ కుమారుడు కూడా ఉన్నారని సమాచారం. కారు రిజిస్ట్రేన్‌ మాత్రం ఇన్‌ఫ్రా కంపెనీ పేరుతో ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఒక్కరే ఉన్నారని అంటున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. కారు రిజిస్ట్రేషన్‌ను పరిశీలించేందుకు ప్రత్యేక పోలీసు బృందం వెళ్లింది. కారుకు ఎమ్మెల్యే స్టికర్‌ ఎలా వచ్చిందనే అంశంపై ఆరా తీస్తోంది. ఎమ్మెల్యేకి రెండు స్టికర్లు మాత్రమే ఇస్తారు. ఈ కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఎలా వచ్చింది? ఎమ్మెల్యే షకీల్‌ అహ్మద్‌ తన ఫ్రెండ్స్‌కు కారు స్టిక్కర్‌ ఇచ్చినట్టు తొలుత చెప్పారు.

అతను ఎవరు..?

అతను ఎవరు..?


ప్రమాదం చేసిన కారు ఆ ఫ్రెండ్స్‌దేనా.. ప్రమాదం తర్వాత పరారైన మీర్జా ఎమ్మెల్యే స్నేహితుడేనా.. అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పరారీలో ఉన్న మీర్జా కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతను పట్టుబడితే వాస్తవాలు తెలుస్తాయి. అంతేకాదు మద్యం తాగి కారు నడిపారా.. లేక ర్యాష్‌ డ్రైవింగ్‌ ప్రమాదానికి కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

English summary
jubilee hills car accident case. bodhan mla shakeel son inside the car police are suspects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X