హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వంద నుంచి "మీరే నన్ను కాపాడాలి దాకా".. కేసీఆర్ మాటల మతలబేంటి?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తడబడుతున్నారా? విజయావకాశాలపై రోజుకో మాట ఎందుకు మాట్లాడుతున్నారు? బ్రహ్మాండమైన మెజార్టీ ఖాయమని చెప్పి ఇప్పుడు ప్రజల చేతుల్లోనే టీఆర్ఎస్ భవితవ్యమున్నదని ఎందుకంటున్నారు? సంక్షేమ పథకాలే తమకు పెద్దపీట వేస్తాయనుకున్న గులాబీ పెద్దాయనకు గెలుపుపై గుబులు పట్టుకుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు కారు రథసారథి వ్యవహరిస్తున్న తీరు సమాధానాలుగా కనిపిస్తాయి.

ప్రచారం ఉధృతమవుతున్న తరుణంలో ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ మాట్లాడుతున్న తీరు చర్చానీయాంశంగా మారింది. బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తామన్న గులాబీ బాస్.. నన్ను మీరే కాపాడాలనేదాకా వచ్చారంటే పరిస్థితి ఏంటనేది ఆసక్తిగా మారింది.

కేసీఆర్ తడబడుతున్నారా?

కేసీఆర్ తడబడుతున్నారా?

ముందస్తు ఎన్నికల ప్రకటన మొదలు నామినేషన్ల ఘట్టం పూర్తయ్యేవరకు 100 సీట్లు ఖాయమని.. బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తామని చెబుతూ వస్తున్నారు కేసీఆర్. అయితే ప్రచారం మొదలయి ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఆయన తడబడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. వంద సీట్లు ఖాయమంటూ జపించిన కేసీఆర్.. గెలిపిస్తే పనిచేస్తా, లేదంటే ఇంట్లో పడుకుంటా.. నాకు నష్టం లేదు మీకే నష్టమంటూ ప్రజలనుద్దేశించి మాట్లాడిన తీరు అందర్నీ విస్మయానికి గురిచేసింది. అలా మాట్లాడిన నాలుగైదు రోజుల్లోనే టీఆర్ఎస్ కు 103 నుంచి 106 సీట్లు ఖాయమంటూ సెలవిచ్చారు. తాజాగా ఆమన్ గల్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసింగించిన కేసీఆర్ "నన్ను మీరే కాపాడాలంటూ" వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అసెంబ్లీ రద్దుకు ముందే సర్వేలు చేయించుకున్న గులాబీ బాస్ 105 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. గెలుపు ధీమాతో దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లిచ్చారు. బ్రహ్మాండమైన మెజార్టీతో వంద స్థానాలు గెలుస్తామని ప్రకటించారు. అయితే కేసీఆర్ కు మొదట్లో ఉన్న ఆ ధీమా రానురాను సన్నగిల్లుతోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 కేసీఆర్ కు ఓటమి భయమా?

కేసీఆర్ కు ఓటమి భయమా?

కేసీఆర్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశంగా మారాయి. టీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై బోలెడన్ని ఆశలు పెట్టుకుని వంద ఖాయమంటూ గెలుపు మంత్రం జపించిన కేసీఆర్.. తాజాగా నన్ను మీరే కాపాడాలంటూ చేసిన వ్యాఖ్యలతో సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించారేమో అనే వాదనలు వినిపిస్తున్నాయి. టీడీపీ, కాంగ్రెస్ 58 ఏళ్ల పాలనకు.. టీఆర్ఎస్ నాలుగున్నరేళ్లకు తేడా ఉండదా అంటూ మాట్లాడటం, తప్పులుంటే సరిదిద్దుకుందాం అనే తీరు దేనికి సంకేతమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు విజయావకాశాలపై కేసీఆర్ కు కాసింత భయం పట్టుకుందనే వాదనలు జోరందుకున్నాయి.

ఇదంతా స్ట్రాటజీయా?

ఇదంతా స్ట్రాటజీయా?

ఎక్కడ ఎలా మాట్లాడాలో కేసీఆర్ కు బాగా తెలుసు. అలాంటిది బ్రహ్మాండమైన మెజార్టీ నుంచి నన్ను మీరే కాపాడాలనే స్థాయికి ఎందుకొచ్చారు? ఈ ప్రశ్నకు రాజకీయ వర్గాల్లో చాలానే సమాధానాలు దొరుకుతున్నాయి. ఇదంతా కేసీఆర్ స్ట్రాటజీ అని కొందరంటే.. క్షేత్రస్థాయిలో ప్రజా కూటమిని బలహీనపరచడానికే అంటున్నారు మరికొందరు. మొత్తానికి కేసీఆర్ మాటలు, కేసీఆర్ స్ట్రాటజీ ఈ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలిస్తాయో చూడాలి.

English summary
Is the TRS Chief KCR fears about winning chances in elections. Why he changing his thoughts day by day. Election point of view, kcr words going hot topic. Some one saying that these are all KCR's strategy and some more saying that to keen down the peoples front.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X