హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మునిసిపల్ ఎన్నికల సమరోత్సాహంతో .. తెలంగాణలో మరో ఎన్నికలకు సిద్ధం అవుతున్న సీఎం కేసీఆర్..

|
Google Oneindia TeluguNews

తెలంగాణాలో మునిసిపల్ ఎన్నికలలో విజయం సాధించిన టీఆర్ఎస్ అదే ఉత్సాహంతో మరో ఎన్నికలకు సిద్ధం అవుతుంది. మునిసిపల్ ఎన్నికలు ఇచ్చిన ఊపుతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో ఎన్నికలకు రెడీ అంటున్నారు . నాలుగు రోజుల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అంతా అనుకూలంగా ఉన్నప్పుడే పనులు చక్కబెట్టుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.

తెలంగాణా సీఎం కేసీఆర్ కొత్త సంవత్సరం కొత్త సంకల్పం ... 2020లో ఆయన నినాదం ఇదేతెలంగాణా సీఎం కేసీఆర్ కొత్త సంవత్సరం కొత్త సంకల్పం ... 2020లో ఆయన నినాదం ఇదే

సహకార సంఘాల ఎన్నికలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

సహకార సంఘాల ఎన్నికలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

రాష్ట్రం లో మొత్తం 584 మండలాలకు 906 సహకార సంఘాలు ఉండేవి. అయితే.. మండలాల సంఖ్య పెరిగిన నేపథ్యం లో ఈసారి మొత్తం 1340 సహకార సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికలు ఇచ్చిన విజయంతో సమరోత్సాహంలో ఉన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ఈ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు.సహకార సంఘాల ఎనిఇకలు ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన నేపధ్యంలో మరోసారి వాయిదా వెయ్యటానికి వీలులేని పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ సహకార ఎన్నికలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు .

నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ .. 15 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ

నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ .. 15 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ

నాలుగు రోజులలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేలా నోటిఫికేషన్ జారీ చేయాలని, 15 రోజుల్లో మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, ఎన్నికలు వెంటనే జరిపించాలని సూచించారు. ఇన్ చార్జ్ ల పదవీకాలం ముగిసేలోగానే షెడ్యూల్ ను ప్రకటించాలని కేసీఆర్ పేర్కొన్నారు . దీంతో అధికారులు సహకార సంఘాల ఎన్నికల కసరత్తు ప్రారంభించారు.

పలు మార్లు వాయిదా పడిన ఎన్నికలు .. ఎట్టకేలకు ప్రభుత్వ ఆమోదం

పలు మార్లు వాయిదా పడిన ఎన్నికలు .. ఎట్టకేలకు ప్రభుత్వ ఆమోదం

గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పదవీ కాలం ముగిసి చాలా కాలం అయ్యింది . ప్రస్తుతం కొత్త పాలక వర్గాల్ని నియమించాలన్న ఆలోచనలో ఉన్న సీఎం కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సహకార ఎన్నికలు తెలంగాణలో రెండేళ్ల క్రితం అంటే 2018లోనే జరగాల్సి ఉన్నా వాయిదా పడుతూ వచ్చాయి. పాలక వర్గాల స్థానంలో పర్సన్ ఇన్ ఛార్జీలను నియమించిన కేసీఆర్ ఇప్పుడున్న సానుకూల రాజకీయ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు.

English summary
The TRS, which won the municipal elections in Telangana, will prepare for another election with the same enthusiasm. Telangana state chief minister KCR is ready for another election with a boost in municipal elections. CM KCR is expected to issue an election notification to the primary agricultural cooperatives within four days. CM KCR hopes to improve the work when everything is compatible.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X