వివాహిత అదృశ్యం.. ఏడాది క్రితం పెళ్లి, ఐటీ కొలువు.. కానీ
హైదరాబాద్‌లో ఓ యువతి కనిపించకుండా పోయింది. దోమలగూడలో ఉంటున్న భార్గవి అనే యువతి నిన్నటి నుంచి కనిపించకుండా పోయింది. బ్యూటీ పార్లర్ కు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన భార్గవి తిరిగి రాలేదు. దీంతో నిన్నటి నుంచి కుటుంబీకులు భార్గవి కోసం తెలిసిన వాళ్ల దగ్గర, బంధువుల ఇళ్లలో వెతికారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు.

భార్గవి ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తోంది. ఆమెకు ఏడాది క్రితమే వివాహమైంది. భార్గవి ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నగరంలోని పలు ప్రాంతాల్లో భార్గవి నడుచుకుంటూ తిరుగుతున్నట్లు సీసీ కెమెరాల ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. భార్గవి ఆచూకీ కోసం పోలీసులు విసృతంగా గాలిస్తున్నారు.
Recommended Video
భార్గవి.. భార్య భర్తల మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అనే అంశంపై క్లారిటీ లేదు. మంచి కొలువు చేస్తూ.. ఎక్కడికి వెళ్లిందనే అనుమానం వస్తోంది. భర్త వేధించేవాడా..? లేక ఇతర సమస్య ఉందా అనే సందేహాలు వస్తున్నాయి. కానీ భార్గవి కనిపించే వరకు ఇవన్నీ సశేష ప్రశ్నలుగానే మిగులుతాయి.












Click it and Unblock the Notifications