హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మిస్టరీగా దిశా తరహా యువతి అత్యాచారం,హత్య .. ఆధారాలు లేకుండా పక్కా ప్లాన్

|
Google Oneindia TeluguNews

రంగారెడ్డి జిల్లాలో తంగడపల్లి బ్రిడ్జి క్రింద అత్యాచారం , హత్యకు గురైన యువతి కేసులో మిస్టరీ వీడలేదు. పోలీసులకు ఈ కేసు పెద్ద సవాల్ గా మారింది. యువతి ఆనవాలు కూడా గుర్తించకుండా ఆమె ముఖం బండరాయితో ఛిద్రం చెయ్యటంతో ఆమె ఎవరు అనేది గుర్తించటం కష్టంగా మారింది.

రంగారెడ్డి జిల్లాలో మరో దిశ ఘటన ..బ్రిడ్జి క్రింద బట్టలు లేకుండా.. యువతి అత్యాచారం, హత్యరంగారెడ్డి జిల్లాలో మరో దిశ ఘటన ..బ్రిడ్జి క్రింద బట్టలు లేకుండా.. యువతి అత్యాచారం, హత్య

రంగారెడ్డి జిల్లాలో మహిళ మర్డర్ మిస్టరీ .. ఆధారాలు లేకుండా చేసి

రంగారెడ్డి జిల్లాలో మహిళ మర్డర్ మిస్టరీ .. ఆధారాలు లేకుండా చేసి

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనను తెలంగాణా రాష్ట్ర ప్రజలు ఇంకా మరచిపోలేదు. ఇక ఇదే సమయంలో తాజాగా రంగారెడ్డి జిల్లాలో అదే తరహా ఘటన చోటు చేసుకుంది. యువతిని అత్యాచారం చేసి హత్యచేసిన దుండగులు ఆమెను చిలుకూరు-వికారాబాద్‌ రహదారిపై రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లి వంతెన కింద పడేసి వెళ్ళిపోయారు.ఇక స్థానికులకు మహిళ మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు.

కేసు నమోదు

కేసు నమోదు

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఒక్క ఆధారం కూడా దొరక్కపోవటం ఈ మర్డర్ మిస్టరీ పై చర్చకు కారణం అవుతుంది . హత్యకు గురైన యువతి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అని భావించినా అందుకు ఆధారాఉ లభించలేదు . ఇక ఆమె ముఖం , తల పూర్తిగా ఛిద్రమై ఉంది. శరీరంపై దుస్తులు లేవు. మహిళను గుర్తుతెలియని దుండగులు అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

బట్టలు లేకుండా ఉన్న మహిళ మృతదేహం .. ఒంటిపై బంగారు ఆభరణాలు

బట్టలు లేకుండా ఉన్న మహిళ మృతదేహం .. ఒంటిపై బంగారు ఆభరణాలు

ఇక ఘటనా స్థలంలో ఆమెకు సంబంధించిన నేరస్తులకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవు . ఇక యువతి మృతదేహంపై గుర్తించిన బంగారు గొలుసు, చెవి కమ్మలు, ఉంగరం స్వాధీనం చేసుకున్నారు. మహిళ ఒంటిపై బంగారం అలాగే ఉండటంతో ఎవరో దోపిడీ దొంగలు చేసిన పని కాదని అర్ధం అవుతుంది. ఆమెను ఎక్కడి నుంచో తీసుకొచ్చి అత్యాచారం చేసి, హత్య చేసి ఉంటారని యువతిని గుర్తించకుండా ఉండటం కోసం తలపై రాయితో కొట్టి చిద్రం చేసినట్టు తెలుస్తుంది.

Recommended Video

5 Minutes 10 Headlines || KCR Nominates Kavitha As MLC || Virus Impact On Indians Abroad
కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు.. మిస్టరీ ఛేదించే యత్నం

కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు.. మిస్టరీ ఛేదించే యత్నం

24 గంటలు గడిచిపోయినప్పటికీ ఎటువంటి ఆధారాలు లభించకపోవటంతో ఘటన మిస్టరీపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. హత్య ఘటనలో ముగ్గురి హస్తం ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, అక్రమ సంబంధం కారణంగానే హత్య జరిగి ఉంటుందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళ డీఎన్‌ఏ నమూనాలను ఉస్మానియా ఫోరెన్సిక్ కి పంపించారు. అయితే ఆ మహిళ ఎవరు అనేది మాత్రం ప్రస్తుతానికి మిస్టరీనే .

English summary
A software employee murder happened in Rangareddy district tangadapalli villaage . She was brutally murdered and the culprits leave her body under the tandgadapalli bridge without clothes . police filed the case and started investigation .there is no evidence in the spot about the deceased and also about the culprits . police taken this case as challenge to findout the murder mistery .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X