బారత్‌లో కత్తులు, తల్వార్.. వీడియో వైరల్, ఎక్కడ అంటే..
పెళ్లి అంటే తెగ హడావిడి.. అయితే మ్యారేజ్ తర్వాత మాత్రం బరాత్ పేరుతో చేసే రచ్చ రచ్చ.. కొందరు వద్దంటున్న ఫైర్ చేయడం, కత్తి పట్టుకోవడం చేస్తున్నారు. వద్దని చెబుతున్న వినడం లేదు. పోలీసులు చెప్పినా లెక్క చేయడం లేదు. ఇటీవల చాలా ఘటనలు వెలుగు చూశాయి. వైరల్ న్యూస్ కూడా మనం చూశాం.. ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున పాతబస్తీలో ఘటన జరిగింది.
ఓ పెళ్లి జరిగింది. మ్యారేజ్ అంటే రచ్చ చేశారు.. కానీ మీర్ చౌక్‌లో యువత కొందరు హల్ చల్ చేశారు. కత్తులు, తల్వార్లతో హంగామా చేశారు. కత్తులు పట్టుకొని డ్యాన్స్ చేశారు. ఆ వీడియో, ఫోటోలు బయటకు వచ్చాయి. దీనిపై పోలీసులు స్పందించాల్సి ఉంది. కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.

పెళ్లిలో యువకులు కత్తి పట్టుకున్నారు. పెద్ద పెద్ద తల్వార్ పట్టుకున్నారు. దానిని చూసిన వారే భయపడుతున్నారు. వీడియో చూసిన వారి పరిస్థితి ఏంటో అర్థం చేసుకవచ్చు. కాల్పులు జరిపి గాయపడి, చనిపోయిన దాఖలాలు చూశాం. కత్తులు లాంటి మరణాయులు పట్టుకోవద్దు.. ఎందుకంటే అప్పటికే మత్తులో ఉంటారు. జరగరానిదీ జరిగితే.. ఎవరూ బాధ్యులు.. అనే ప్రశ్న తలెత్తింది.
ఇటీవల యూపీలో గల ఝాన్సీ సదర్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. అయితే పోలీస్ స్టేషన్‌లో యూనిఫామ్ వేసుకొని మరీ డ్యాన్స్ చేశారు. కొందరు యూనిఫామ్ వేసుకోగా.. సివిల్ డ్రెసులో ఉన్నారు. వారంతా ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నారు. డిస్కో బీట్‌పై ఆడుతున్నారు. అంతా జోష్‌లో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునే ఊపులో లేరు. ఇంతలో కానిస్టేబుల్ కుల్దీప్ చేతిలో తుపాకీ పట్టుకున్నారు. ఇంకేముంది అదీ తెగ వైరల్ అవుతుంది. ఖాకీ గన్ పట్టుకోవడం ఏంటీ అనే చర్చ జరిగింది. విషయం పై అధికారులకు తెలిసింది. దీంతో కానిస్టేబుల్ కుల్దీప్‌పై చర్యలకు ఉపక్రమించారు. అతనిని సస్పెండ్ చేశారు. మరెవరు ఇలా చేయకూడదని కఠినంగా వ్యవహరించారు