హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ షర్మిల: భగత్ సింగ్, రాజు ఒక్కటేనా..? వయస్సు పోల్చి, కాంట్రవర్సీ కామెంట్స్..

|
Google Oneindia TeluguNews

రేపిస్ట్ రాజు చచ్చాడు.. ఆత్మహత్యో.. ట్రైన్ కౌంటరో తెలియదు కానీ.. మొత్తానికి చనిపోయాడు. అంతా కూల్.. చిన్నారికి న్యాయం జరిగిందని అనుకున్నాం.. కానీ కాంట్రవర్సీ కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. చిన్నారి చనిపోయిన తర్వాత.. ఆమె పేరంట్స్‌ను వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల పరామర్శించారు. దీక్ష కూడా చేశారు. తర్వాతమీడియాతో మాట్లాడుతూ టంగ్ స్లిప్ అయ్యారు. అదీ కాస్త పేడర్థానికి దారితీసింది. ఇంతకీ ఆమె ఏం అన్నారంటే..

30 ఏళ్లకే ఇలా..

రేపిస్ట్ రాజు వయస్సు 30 ఏళ్లు.. చిన్న వయస్సులోనే అతను చనిపోయాడు. ఆయన చనిపోవడానికి గల కారణం ఏంటీ అని షర్మిల అన్నారు. అంటే చిన్నారిని రేప్ చేసి, హత మార్చిన తర్వాతే సూసైడ్ చేసుకున్నాడు. దాని కారణం ఎవరూ అని అడిగారు. ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని కోరారు. అంతటితో ఊరుకోలేదు.. రాజు, భగత్ సింగ్ అంటూ మాట కలిపారు. భగత్ సింగ్ కన్నా చిన్న వయస్సులో చనిపోయాడని షర్మిల అన్నారు. దీంతో దేశ భక్తుడితో.. నీచుడిని పోల్చడం వివాదానికి దారితీసింది.

దేశం కోసం..

దేశం కోసం..

భగత్ సింగ్ దేశం కోసం పనిచేశాడని.. ప్రాణ త్యాగం చేశారని వివరించారు. కానీ రేపిస్ట్ రాజు కూడా చిన్న వయసులో చనిపోయాడు అని చెప్పడం ఇబ్బందికి గురిచేసింది. అతను దేశం కోసం పనిచేయలే.. కానీ ఏం చేస్తన్నామో తెలియడం లేదని చెప్పారు. ఆశయం లేకుండా బతుకుతున్నారని కామెంట్ చేశారు. ఒక్క రాజే కాదు.. యువత అందరూ అని షర్మిల్ కామెంట్ చేశారు. ఇదీ దుమారం రేపింది.

ప్రత్యక్ష సాక్షులు ఇలా

ప్రత్యక్ష సాక్షులు ఇలా

రాజు ఆత్మహత్యకు సంబంధించి ప్రత్యక్షసాక్షులు ఇద్దరు రైల్వే కీమెన్లు పూర్తి వివరాలను తెలియజేశారు.ఇద్దరం ఉదయాన్నే డ్యూటీకి ఎక్కామని వారు వివరించారు, ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్తుండగా ఒక వ్యక్తి పొదల్లోకి పారిపోయాడని వారు చెప్పారు. అనుమానం వచ్చి చెట్లలోకి వెళ్లి చూడగా అతను కనిపించలేదని తెలిపారు. ఆ తర్వాత తామిద్దరం ఒక 200 మీటర్ల దూరం వరకు ట్రాక్ పై నడుచకుంటూ వచ్చామని, ఆ సమయంలో హైదారాబాద్ వైపుగా వెళ్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్‌కు ఎదురుగా వెళ్లి అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు.

రాజు అని

ఆ తర్వాత వెళ్లి పరిశీలించగా రాజు అనే అనుమానం తమకు వచ్చిందని వివరించారు. ఆ వెంటనే 100కు డయల్ చేసి సమాచారం అందజేశామని తెలిపారు. ఉదయం 8.40 గంటలకు రాజు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. రాజు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అతని డెడ్ బాడీని కుటుంబసభ్యులు కూడా ధృవీకరించారు. చేతిపై మౌనిక అనే పేరు కూడా ఉంది. చిన్నారి చనిపోయిన ఏడు రోజులకు కీచక నీచుడు రాజుకు కూడా అదేవిధంగా శిక్షపడింది. తనకుతానే ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది.

ఎన్ కౌంటర్ అని..?

ఎన్ కౌంటర్ అని..?


చిన్నారి ఘటన ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది. నిందితుడు రాజును కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వస్తోంది. ఈ క్రమంలో నేతలు, ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టంచేశారు. ఒకడుగు ముందుకేసి చంపేయాల్సిందేనని కామెంట్ చేశారు. ఘటనపై రాజకీయ, సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో రియాక్టయ్యారు. హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. మంత్రి మల్లారెడ్డి మరో అడుగు ముందుకేశారు. ఇది చాలా ఘోరం. తప్పకుండా వాడిని ఎన్ కౌంటర్ చేయాలని కోరారు. ఎన్ కౌంటర్ చేస్తాం.. విడిచిపెట్టేదే లేదన్నారు. ఫ్యామిలీ వద్దకెళ్లి పరామర్శించడం మాత్రమే కాదు. కుటుంబానికి న్యాయం చేస్తాం అని తెలిపారు. ఆ కుటుంబాన్ని అన్నిరకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. నిందితుడిని ఎన్ కౌంటర్ చేస్తాం అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కానీ ఇంతలోనే రాజు పాపం పండింది.

Recommended Video

సింగరేణి బాదిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలన్న షర్మిళ!!
పసిమొగ్గపై

పసిమొగ్గపై

ఆరేళ్ల పాపపై ఓ కామాంధుడు ఆకృత్యానికి ఒడిగట్టాడు. చిన్నారిని రేప్ చేసి దారుణంగా చంపేశాడు. స్థానికంగా ఉండే రాజు అనే ఆటో డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. సింగరేణి కాలనీలో 9వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటల నుంచి పాప కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా గాలించారు. రాత్రయ్యే వరకూ ఆచూకీ తెలియకపోవడంతో ఆ ఏరియాలో జులాయిగా తిరిగే రాజుపై స్థానికులకు అనుమానం వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా చందంపేట్ మండలం నుంచి హైదరాబాద్ వచ్చి ఆటో డ్రైవర్‌గా పని చేసేవాడు. చిల్లర దొంగతనాలు చేస్తూ ఆ ఏరియాలో జనాలతో దురుసుగా వ్యవహరిస్తూ ఉండేవాడు. దీంతో అతడు పాపను ఏమైనా చేశాడేమోననే అనుమానంతో అర్థరాత్రి సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా అతని గదిలో ఆ చిన్నారి విగత జీవిగా పడి ఉంది. సాయంత్రం వరకూ ఆడుకుంటూ కనిపించిన తమ బిడ్డ అలా ఓ కిరాతకుడికి బలైపోవడం చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబసభ్యులు, స్థానికులు కూడా కంటతడిపెట్టారు. రాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇంతలో రాజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాను దొరికితే ఏం జరుగుతుందోనని ఊహించి ఉంటాడు. అందుకే ఆత్మహత్య చేసుకుని ఉంటాడు. కానీ అదీ ట్రైన్ కౌంటర్ అని కామెంట్స్ చేస్తున్నారు. పౌర హక్కుల సంఘం హైకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో జ్యుడిషీయల్ విచారణకు ఆదేశించింది.

English summary
ysrtp president ys sharmila controversy comments on Rapist raju. he is death below 30 years
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X