బార్ల, బీర్ల, ఆత్మహత్యల తెలంగాణ.. చైత్ర పేరంట్స్‌కు షర్మిల పరామర్శ, కేసీఆర్‌పై ఫైర్
చిన్నారి చైత్ర పేరంట్స్‌ను వైఎస్ షర్మిల పరామర్శించారు. ఇదీ దారుణ ఘటన అని ఆమె అభివర్ణించారు. ఘటనపై సీఎం కేసీఆర్ ఇంతవరకు స్పందించలేదు. ఆయన స్పందించేంతవరకు నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు. అలాగే బాధిత కుటుంబానికి రూ. 10 కోట్ల పరిహారం ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న ప్రాంతమే ఇలా ఉంటె రాష్ట్రాన్ని ఏం డెవలప్ చేస్తారని ప్రశ్నించారు. ఇక్కడ నీళ్లు దొరకవు, కానీ మద్యం ఏరులై పారుతుందని షర్మిల విమర్శించారు. అందుకే నేరాలు పెరుగుతున్నాయని వివరించారు. చిన్న పిల్లలపై లైంగికదాడి చేసి.. హతమార్చడం చూస్తే.. మద్యం, డ్రగ్స్ సరఫరా ఏ విధంగా ఉందో అర్థమవుతోందని అనుమానం వ్యక్తం చేశారు.

ఫెయిల్యూర్..
ఇదీ పోలీసుల వైఫల్యం కాదా అని షర్మిల ప్రశ్నించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా అని నిలదీవారు. పోలీసులు ఎంత బాగా పనిచేస్తున్నారో తెలియజేయడానికి ఇదొ ఉదహరణ అని చెప్పారు. చైత్ర ఘటన సమయంలో లాఠీఛార్జ్ చేసి మరీ చిన్నారి శవాన్ని గుంజుకుపోయారని మండిపడ్డారు. పోస్టుమార్టం కోసం తల్లిదండ్రుల అనుమతి లేకపోయినా శవాన్ని గుంజుకుపోయి పోర్టుమార్టం చేయించారని ఫైరయ్యారు. పోస్టుమార్టం రిపోర్ట్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.

లైంగికదాడి జరిగితే స్పందించరా..?
పోలీసులు ప్రజల కోసం పనిచేయడం లేదని షర్మిల విమర్శించారు. వారంతా కేసీఆర్‌కు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు తీసుకునే పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించకుండా కేసీఆర్ కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఇంట్లో కుక్క హస్కీ చనిపోతే డాక్టర్ ఉద్యోగం నుంచి తీసేసిన కేసీఆర్, చిన్నపిల్లలపై అత్యాచారం జరిగే ఎందుకు స్పందించరని అడిగారు. హంతకుడు దొరికాడా లేదా తెలుసుకొని మంత్రి ప్రజలకు సేవ చేసేందుకు ఎంత సమయం కేటాయిస్తున్నాడో అర్థమవుతుందన్నారు. ప్రజలకు సరైన సమాచారం ఇవ్వలేని కేటీఆర్ మంత్రి కావడం మన దౌర్భాగ్యం అని చెప్పారు. దీనిపై మంత్రి కేటీఆర్ రీ ట్వీట్ కూడా చేసిన సంగతి తెలిసిందే.
హుజురాబాద్‌కే సీఎం..?
సీఎం కేసీఆర్ హుజురాబాద్‌కు ముఖ్యమంత్రా.. లేదా అందరీకా అని తెలియాల్సి ఉందన్నారు. ఎన్నికలు వస్తేనే బయటకు వస్తారని ఫైరయ్యారు. మహిళలపై లైంగికదాడులు కేసీఆర్ హయాంలో మూడు రెట్లు అధికం అయ్యాయని చెప్పారు. ఫామ్ హౌస్ మత్తులో కేసీఆర్ ఉంటారని చెప్పారు. రాష్ట్రంలో డ్రగ్స్, మద్యం, గంజాయి విచ్చలవిడిగా పెరిగాయని గుర్తుచేశారు. అప్పుల తెలంగాణ, బార్ల తెలంగాణ, బీర్ల తెలంగాణ, ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని షర్మిల ఫైరయ్యారు. చైత్ర ఘటనపై కేసీఆర్ రియాక్ట్ కావాలని.. నిందితుడిని ఎన్ కౌంటర్ చేస్తారా..? ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తారా అని అడిగారు. అమ్మాయిలపై చేయి వేస్తే తల తెగిపడుతుందనే భయం కల్పించాలని కోరారు. గిరిజనులను అంటే కేసీఆర్ స్పందించరా అని అడిగారు.
ఎన్ కౌంటర్ అని..
చిన్నారి చైత్ర ఘటన ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది. నిందితుడు రాజును కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వస్తోంది. ఈ క్రమంలో నేతలు, ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టంచేశారు. ఒకడుగు ముందుకేసి చంపేయాల్సిందేనని కామెంట్ చేశారు. ఇటీవల తొడగొట్టి హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సారి కామెంట్ చేసినా.. అదీ ఓ నీచుడి శిక్ష కోసం వ్యాఖ్యలు చేశారు. ఘటనపై రాజకీయ, సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో రియాక్టయ్యారు. హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. మంత్రి మల్లారెడ్డి మరో అడుగు ముందుకేశారు. ఇది చాలా ఘోరం. తప్పకుండా వాడిని ఎన్ కౌంటర్ చేయాలని కోరారు. ఎన్ కౌంటర్ చేస్తాం.. విడిచిపెట్టేదే లేదన్నారు. ఫ్యామిలీ వద్దకెళ్లి పరామర్శించడం మాత్రమే కాదు. కుటుంబానికి న్యాయం చేస్తాం అని తెలిపారు. ఆ కుటుంబాన్ని అన్నిరకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. నిందితుడిని ఎన్ కౌంటర్ చేస్తాం అని మంత్రి మల్లారెడ్డి అన్నారు.
చిల్లర దొంగతనాలు
ఆరేళ్ల పాపపై ఓ కామాంధుడు అకృత్యానికి ఒడిగట్టాడు. చిన్నారిని రేప్ చేసి దారుణంగా చంపేశాడు. స్థానికంగా ఉండే రాజు అనే ఆటో డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. సింగరేణి కాలనీలో గురువారం సాయంత్రం 5 గంటల నుంచి పాప కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా గాలించారు. రాత్రయ్యే వరకూ ఆచూకీ తెలియకపోవడంతో ఆ ఏరియాలో జులాయిగా తిరిగే రాజుపై స్థానికులకు అనుమానం వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా చందంపేట్ మండలం నుంచి హైదరాబాద్ వచ్చి ఆటో డ్రైవర్‌గా పని చేసేవాడు. చిల్లర దొంగతనాలు చేస్తూ ఆ ఏరియాలో జనాలతో దురుసుగా వ్యవహరిస్తూ ఉండేవాడు. దీంతో అతడు పాపను ఏమైనా చేశాడేమోననే అనుమానంతో అర్థరాత్రి సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా అతని గదిలో ఆ చిన్నారి విగత జీవిగా పడి ఉంది. సాయంత్రం వరకూ ఆడుకుంటూ కనిపించిన తమ బిడ్డ అలా ఓ కిరాతకుడికి బలైపోవడం చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబసభ్యులు, స్థానికులు కూడా కంటతడిపెట్టారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications