పేదల వైద్యానికి 8వందల కోట్లు లేవా దొరా? ఆరోగ్యశ్రీ జోలికొస్తే ఖబడ్దార్: వైఎస్ షర్మిల!!
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని, చాలా విషయాలలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్యాయం చేస్తున్నారని పదేపదే మండిపడుతున్న వైయస్ షర్మిల ఆరోగ్యశ్రీని మూసివేయాలని ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు.

కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ నిర్వీర్యం
వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చారని పేర్కొన్న షర్మిల, ఆరోగ్యశ్రీ పథకాన్ని సీఎం కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీ మహానేత వైఎస్ఆర్ సృష్టించిన గొప్ప పథకం అని పేర్కొన్న వైయస్ షర్మిల పేదలకు ఏ రోగమొచ్చినా కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించాలని ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. దీని ద్వారా లక్షల మంది ఉచితంగా వైద్యం, ఆపరేషన్లు చేయించుకున్నారని వైయస్ షర్మిల పేర్కొన్నారు. కానీ కెసిఆర్ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశాడని వైయస్ షర్మిల మండిపడ్డారు.

నీకు జ్వరం వేస్తే యశోద.. కంటికి నొప్పి వస్తే ఢిల్లీకి.. కానీ పేదల పరిస్థితి ఏంటి?
ఈ పథకానికి నిధులు ఇవ్వకుండా, పేదలకు కార్పొరేట్ వైద్యం అందించకుండా కెసిఆర్ కుట్ర చేస్తున్నాడు అని పేర్కొన్న వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అందించే ఉచిత వైద్య సేవలను కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నాడంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే గ్రామస్థాయిలో పేదలకు ఉచిత వైద్యం, మందులు అందించే 104 అంబులెన్స్ లను మూసేశారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి ఎసరు పెడుతున్నాడు. నీకు జ్వరం వేస్తే యశోద.. కంటికి నొప్పి వస్తే ఢిల్లీకి.. పోతావ్! అంటూ ప్రశ్నించిన వైయస్ షర్మిల పేదలకు కార్పొరేట్ ఆసుపత్రులకు పోవద్దా అంటూ నిలదీశారు.

నీ పార్టీ అకౌంట్ లో వేల కోట్లున్నా.. పేదల వైద్యానికి డబ్బు లేదా దొరా?
నీ పార్టీ అకౌంట్లో వేల కోట్లు ఉంటయ్.. కమీషన్ల కాళేశ్వరానికి లక్షల కోట్లు ఉంటయ్.. బి ఆర్ ఎస్ ఆఫీసు కట్టుకోవడానికి వేల కోట్ల పైసలు ఉంటాయ్.. కానీ పేదల వైద్యానికి ఎనిమిది వందల కోట్లు లేవా దొరా అంటూ వైయస్ షర్మిల సీఎం కేసీఆర్ కు సూటి ప్రశ్న వేశారు. ఆరోగ్యశ్రీని మూసివేయాలని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదు ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వ పాలన వైఫల్యాలను అడుగడుగున ఎండగడుతున్న వైయస్ షర్మిల నిత్యం ఏదో ఒక విషయంలో ప్రజా సమస్యలపై , పాలకుల తీరును ప్రశ్నిస్తూనే ఉన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications