స్టాప్ నర్సు పోస్టింగులు ఇవ్వండి.. సీఎస్ సోమేశ్‌కు షర్మిల లేఖ
స్టాప్ నర్సులకు పోస్టింగ్ ఇవ్వాలని వైఎస్ షర్మిల గళం మెత్తారు. ఇటీవల ఇదే అంశాన్ని ప్రస్తావించిన ఆమె ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు లేఖ రాశారు. కరోనా సమయంలో వారికి పోస్టింగ్ ఇచ్చి.. ఆదుకోవాలని కోరారు. రోగులకు సేవ చేసే అవకాశం ఉంటుందని వివరించారు. పక్కనపెట్టిన వారితో సహా ఇతరులకు కూడా పోస్టింగ్ ఇవ్వాలని షర్మిల కోరారు.
2017లో 3,311 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2018లో పరీక్ష నిర్వహించగా.. 2021 ఫిబ్రవరిలో ఫలితాలు వెల్లడించారు. కటాఫ్ మార్కుల ఆధారంగా 3,170 మంది అర్హత సాధించారని.. ఫిబ్రవరి, మార్చి నెలల్లో 3076 మంది సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేసి, అందరినీ వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలని కమిషన్ తెలిపిందన్నారు. 2,418 మందిని మాత్రమే ఎంపిక చేసిన టీఎస్పీఎస్సీ, మిగతా 658 మందిని ఎలాంటి కారణాలు లేకుండా పక్కన పెట్టిందని తెలిపారు.

కరోనా విజృంభిస్తున్న వేళ సెలెక్ట్ అయిన స్టాఫ్ నర్సులను పక్కన బెట్టి.. కాంట్రాక్టుపద్ధతిన వైద్య సిబ్బందిని నియమించడం సరికాదన్నారు. పీఆర్సీ నివేదిక ప్రకారమే వైద్య, ఆరోగ్యశాఖలో 23,724 పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న సమయంలో ఆ పోస్టులను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. గత ఏడాది బడ్జెట్ లో ఆరోగ్యశాఖకు 3. 3శాతం నిధులు కేటాయించిన ప్రభుత్వం.. కరోనా సమయంలో ఈ ఏడాది అధిక నిధులు కేటాయించడం పోయి.. 2.7 శాతం నిధులు మాత్రమే ఇచ్చి.. ప్రజారోగ్యాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో అర్థంకావడం లేదన్నారు.
Recommended Video
కొత్త ఆసుపత్రులను నిర్మించాలని.. మరో 50 వేల వైద్య సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం భావించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. స్టాఫ్ ను నియమించే ముందు.. మీ నిర్లక్ష్యానికి నష్టపోతున్న 658 కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications