షేర్వాణీ, పరేషానీ.. కేసీఆర్ సర్కార్‌పై షర్మిల నిప్పులు
సమయం దొరికితే చాలు వైఎస్ షర్మిల కూడా రెచ్చిపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. వారానికోసారి నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తోన్న షర్మిల.. ప్రజలతో మమేకమయిన ప్రతీసారీ ఫైర్ అవుతున్నారు. మనం కొరుకున్న తెలంగాణలో అనుకున్నది అమలు కావడం లేదని ఫైరయ్యారు. కేసీఆర్ రాజ్యంలో పేదల బతుకులు ఆగం అవుతున్నాయని తెలిపారు.

అంతా అద్భుతమే..?
కోరుకున్న తెలంగాణలో అవీ జరగడం లేదని షర్మిల అన్నారు. రాష్ట్రంలో అన్నీ అద్భుతం అని నిన్న సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగంపై షర్మిల వ్యంగ్యం ప్రదర్శించారు. "ఊపర్ షేర్వాణీ... అందర్ పరేషానీ... కేసీఆర్ కీ కహానీ!" అంటూ ఎద్దేవా చేశారు. "రాష్ట్రంలో కరోనా చావులు లేవు... అంతా అద్భుతమే! మూడెకరాల భూమి అందని దళితులు లేరు, డబుల్ బెడ్ రూం ఇళ్లు దొరకని పేదలు లేరు, రాష్ట్రానికి అప్పులు లేవు, తాగుబోతుల తెలంగాణ కాదు, గల్లీకొక బారు లేదు, వీధికొక వైన్ షాపు లేదు, పసిపిల్లల మీద, మహిళల మీద అత్యాచారాలు లేవు, నిరుద్యోగ చావులు లేవు, రైతుల ఆత్మహత్యలు లేవు... అంతా అద్భుతమే అంటూ తనదైనశైలిలో విమర్శలు చేశారు.

రంగులు మారుస్తూ..
ఊసరవెల్లిలా రంగులు మార్చే మాటలు అద్భుతం అని కేసీఆర్‌ను తిట్టిపోశారు. మీ అబద్ధాల పాలన మహా అద్భుతం!" అని కామెంట్ చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. కేసీఆర్ ప్రసంగం తాలూకు పత్రికా కథనాన్ని కూడా షర్మిల షేర్ చేశారు. కేసీఆర్ చెప్పినవీ ఏవీ జరగడం లేదని షర్మిల ఫైరయ్యారు. చెప్పడానికి కబుర్లు తప్ప.. అంతా డొల్లతనమే అని ఫైరయ్యారు.

కొలువులు ఏవీ..?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం.. నీటి కోసం ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నాయి. కానీ అవినీతి ఆరోపణలు మాత్రం తప్పడం లేదు. నిధులు ఉన్నా.. అప్పులు ఎక్కువగా చేస్తున్నారు. కొలువుల కోసం నిరుద్యోగ యువత కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. కానీ ప్రభుత్వం మాత్రం లక్ష పైచిలుకు జాబ్స్ భర్తీ చేశామని చెబుతోంది. వాస్తవం మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నట్టు కనిపిస్తోంది. జాబ్స్ ఏవీ అంటూ నిరుద్యోగులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇటీవల ఓ యువతి బర్లు కాస్తున్నానని షేర్ చేసిన వీడియో వైరల్ అయ్యింది.












Click it and Unblock the Notifications