షాడో కేప్టెన్: టీమిండియా మెంటార్‌గా ధోనీ సత్తాకు సిసలు పరీక్ష: జట్టులో లేకున్నా..జట్టుతో

అబుధాబి: ఇంకో 24 గంటలు.. యావత్ క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ మొదలు కానుంది. 2019లో ఇంగ్లాండ్‌లో ముగిసిన ప్రపంచకప్ టోర్నమెంట్ తరువాత ఈ రెండు దేశాలు ఢీ కొనబోతోండటం ఇదే తొలిసారి కావడంతో.. ఎన్నెన్నో అంచనాలు నెలకొన్నాయి. అటు ప్రపంచకప్ టోర్నమెంట్‌లో గానీ ఇటు టీ20 వరల్డ్‌కప్‌లో గానీ పాకిస్తాన్ చేతిలో ఏనాడూ ఓటమిపాలవ్వని ఘన చరిత్రను కలిగి ఉంది భారత్. అదే చరిత్ర మళ్లీ పునరావృతం అవుతుందనే అంచనాలు అభిమానుల్లో వ్యక్తమౌతోన్నాయి.

2007 తరువాత ఒక్కసారిగా కూడా..

2007లో తొలిసారిగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టీ20ల్లో వరల్డ్ కప్‌ను ప్రవేశపెట్టింది. ఆ సంవత్సమే బోణీ కొట్టింది భారత జట్టు. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో టీమిండియా పైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. టైటిల్‌ను ఎగరేసుకెళ్లింది. ఆ తరువాత మళ్లీ ఎప్పుడూ ఛాంపియన్‌గా అవతరించలేదు. ఇప్పుడా లోటును తీర్చుకోవాలనే పట్టదలతో ఉంది కోహ్లీసేన. దానికి తగ్గట్టుగా తొలి మ్యాచ్ పాకిస్తాన్‌తోనే కావడంతో ఆ జట్టుపై విజయం సాధించితే.. దాని పాజిటివ్ వైబ్రేషన్స్ టోర్నమెంట్ మొత్తం ఉంటాయని అంచనా వేస్తోంది. అందుకే పాకిస్తాన్‌ను మరోసారి చిత్తు చేయడానికి సమాయత్తమౌతోంది.

2007 తరువాత ఒక్కసారిగా కూడా..

2007లో తొలిసారిగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టీ20ల్లో వరల్డ్ కప్‌ను ప్రవేశపెట్టింది. ఆ సంవత్సమే బోణీ కొట్టింది భారత జట్టు. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో టీమిండియా పైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. టైటిల్‌ను ఎగరేసుకెళ్లింది. ఆ తరువాత మళ్లీ ఎప్పుడూ ఛాంపియన్‌గా అవతరించలేదు. ఇప్పుడా లోటును తీర్చుకోవాలనే పట్టదలతో ఉంది కోహ్లీసేన. దానికి తగ్గట్టుగా తొలి మ్యాచ్ పాకిస్తాన్‌తోనే కావడంతో ఆ జట్టుపై విజయం సాధించితే.. దాని పాజిటివ్ వైబ్రేషన్స్ టోర్నమెంట్ మొత్తం ఉంటాయని అంచనా వేస్తోంది. అందుకే పాకిస్తాన్‌ను మరోసారి చిత్తు చేయడానికి సమాయత్తమౌతోంది.

2014లో అవకాశం వచ్చినా..

ఇప్పటిదాకా ఆరుసార్లు టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్స్ ఏర్పాటు కాగా.. భారత్ ఒక్కసారి మాత్రమే టైటిల్ విన్నర్‌గా నిలిచింది. 2014 నాటి టోర్నమెంట్‌లో ఫైనల్ వరకూ వెళ్లగలిగినప్పటికీ.. దాన్ని విజయంగా మలచుకోలేకపోయింది. ఫైనల్‌లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది భారత జట్టు. రన్నరప్‌గా నిలిచింది. కుమార సంగక్కార, మహేల జయవర్ధనె వంటి స్టార్లతో నిండిన లంకేయులు భారత్‌ను చిత్తు చేశారు. చివరిసారిగా 2016లో జరిగిన ఈ టీ20 టోర్నమెంట్‌లో సెమీ ఫైనల్స్ వరకు మాత్రమే వెళ్లగిలిగింది. సెమీస్‌లో వెస్టిండీస్ చేతిలో పరాజయాన్ని చవి చూసింది. ఆ తరువాత మళ్లీ టీ20 ప్రపంచకప్‌లో ఆడబోతోండటం ఇప్పుడే.

అయిదు మ్యాచుల్లో

భారత్- పాకిస్తాన్ మధ్య ఇప్పటిదాకా జరిగింది.. అయిదు టీ20 మ్యాచులే. ఇందులో నాలుగింట్లో టీమిండియా విజయఢంకా మోగించింది. ఒక్క మ్యాచ్ టైగా ముగిసింది. పాకిస్తాన్ ఒక్కసారి కూడా గెలవలేదు. భారత్ అత్యధికంగా 157 పరుగులను చేసింది. ఆ లక్ష్యాన్ని పాకిస్తాన్ ఛేదించలేకపోయింది. 152 పరుగులే చేయగలిగింది. భారత్‌పై పాకిస్తాన్ అత్యధిక స్కోరు 152 పరుగులే. పాకిస్తాన్‌పై భారత్ చేసిన హయ్యెస్ట్ స్కోర్ 157 రన్స్. పాకిస్తాన్‌పై టీమిండియా నమోదు చేసిన లోయెస్ట్ స్కోర్.. 119 పరుగులు. పాకిస్తాన్ చేసిన లోయెస్ట్ స్కోర్ 118. 119 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది పాకిస్తాన్.

ప్లేయర్‌గా ధోనీ జట్టులో లేకపోయినా.. మెంటార్‌‌‌గా జట్టుతో..

మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్‌మెంట్ ప్రకటించిన తరువాత టీమిండియా ఎదుర్కొనబోతోన్న మొట్టమొదటి ప్రపంచకప్ టోర్నమెంట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్లేయర్‌గా ధోనీ జట్టులో లేకపోయినా.. మెంటార్‌‌‌గా జట్టుతో ఉన్నాడు. టీమిండియాతో పాటే అతను ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉంటున్నాడు. జట్టు మొత్తానికీ దిశానిర్దేశాన్ని చేసే బాధ్యతలను అతను మోస్తున్నాడు. మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. 2007 నాటి టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టిన అతని సేవలు, అనుభవాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. ఈ రకంగా వినియోగించుకుంటోంది.

ఐసీసీ టోర్నమెంట్లలోనే..

ఇతర జట్ల తరహాలో అటు పాకిస్తాన్ గానీ, ఇటు టీమిండియా గానీ.. ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడట్లేదు. ఒక దేశం మరో దేశ పర్యటనకూ వెళ్లట్లేదు. సుదీర్ఘకాలంగా ఈ రెండు దేశాల మధ్య ఉన్న క్రీడా సంబంధాలు కూడా అంతంత మాత్రమే. క్రికెట్ ఆడాల్సి వస్తే.. అది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే టోర్నమెంట్లల్లో మాత్రమే సాధ్యపడుతోంది. అది కూడా తటస్థ వేదికల మీదే. అంతే తప్ప భారత జట్టు పాకిస్తాన్‌కు గానీ, పాక్ జట్టు భారత పర్యటనకు గానీ రావడం నిలిచిపోయి చాలా సంవత్సరాలవుతోంది. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ద్వైపాక్షిక సంబంధాల్లో తెగదెంపులు, జమ్మూ కాశ్మీర్‌ అంశం, అక్కడ చోటు చేసుకుంటోన్న ఉగ్రవాద దాడుల నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్ జరగడం అనేది చాలా అరుదు.

ధోనీ మాయాజాలం..

ఈ పరిస్థితుల మధ్య.. టీమిండియాకు మెంటార్‌గా వ్యవహరిస్తోన్న మహేంద్రుడి మీదే అందరి దృష్టీ నిలిచింది. ధోని జట్టులో లేకుండా పాకిస్తాన్‌ను టీమిండియా పాకిస్తాన్‌ను ఎదుర్కొనబోతోండటం ఇదే తొలిసారి. ఇదివరకు ధోనీ సారథ్యంలో.. అతను ప్లేయర్‌గా అందుబాటులో ఉన్నప్పుడు పాకిస్తాన్‌పై ఆడిన అన్ని మ్యాచుల్లోనూ భారత్ ఎప్పుడూ ఓడిపోలేదు. ఒక్క మ్యాచ్ మాత్రం టై అయింది. ఇక ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందనేది ఉత్కంఠతకు గురి చేస్తోంది.

టాపర్‌గా విరాట్ కోహ్లీ..

ఈ అయిదుమందిలోనూ విరాట్ కోహ్లీది హయ్యెస్ట్ స్కోర్. పాకిస్తాన్‌పై టాప్ స్కోరర్ అతనే. ఇప్పటిదాకా 169 పరుగులు చేశాడతను. గౌతమ్ గంభీర్-75, రోహిత్ శర్మ-64, యువరాజ్ సింగ్-59, రాబిన్ ఊతప్ప-58 పరుగులు చేశారు. ఈ అయిదుమందిలో గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప టీమిండియాలో లేరు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టులో కొనసాగుతున్నారు. ఈ ఆదివారం జరిగే మ్యాచ్‌లో వారిద్దరూ ఆడాల్సి ఉంది. నిజానికి- 50 ఓవర్ల మ్యాచ్‌లో రోహిత్ శర్మది హయ్యెస్ట్ స్కోర్. టీ20ల్లో అతను రెండోస్థానంలో ఉన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+