100కోట్ల ఆస్తిని, కూతుర్ని వదిలేసి సన్యాసం: యువ జంట సంచలనం

Subscribe to Oneindia Telugu

భోపాల్: చాలా మంది విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. తమ జీవితాలను మెరుగురుపర్చుకునేందుకు చాలా కష్టపడుతుంటారు. మరికొందరు అడ్డదారులు వెతుకుతారు. సన్మార్గంలో వెళితే మంచి.. చెడ్డ మార్గాన వెళితే చెడు ఫలితాన్ని అనుభవిస్తారు.

ఊహించని నిర్ణయం

ఊహించని నిర్ణయం

కానీ, ఇక్కడ ఓ జంట మాత్రం ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. విలాసవంతమైన జీవితాన్ని వదులుకున్నారు ఆ దంపతులు. తమ కూతురును కూడా వదులుకుంటున్నారు.

వందకోట్ల ఆస్తి, మూడేళ్ల కూతురును కూడా..

వందకోట్ల ఆస్తి, మూడేళ్ల కూతురును కూడా..

మధ్యప్రదేశ్‌లోని నీమచ్ పట్టణానికి చెందిన సుమిత్‌, అనామికా దంపతులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తమ మూడేళ్ల కుమార్తె సహా రూ.100కోట్ల కుపైగా ఆస్తిని తృణప్రాయంగా వదులుకుని సన్యాసం స్వీకరించేందుకు సిద్ధమయ్యారు.

ఉన్నత విద్యావంతులే.. 23న ముహూర్తం

ఉన్నత విద్యావంతులే.. 23న ముహూర్తం

ఆ జంట ఉన్నత విద్యావంతులు కావడం గమనార్హం. సుమిత్ కు వారసత్వంగా వచ్చిన పెద్ద వ్యాపారం కూడా ఉంది. వీటన్నింటినీ వదులుకుని సెప్టెంబర్ 23న సూరత్‌లో జరగనున్న కార్యక్రమంలో ఈ దంపతులు జైన సన్యాసులుగా మారనున్నారు.

అనామిక తండ్రి బీజేపీ అధ్యక్షుడిగా..

అనామిక తండ్రి బీజేపీ అధ్యక్షుడిగా..

కాగా, అనామిక తండ్రి చిత్తోడ్ గఢ్ బీజేపీ అధ్యక్షులుగా గతంలో పనిచేశారు. ఆమె ఇంజినీరింగ్ పూర్తి చేసింది. మొదట ఉద్యోగం చేసిన అనామిక.. ఆ తర్వాత కుటుంబం కోసం గృహిణిగా మారిపోయింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that 100 Cr Property Left by a Couple to become Jain Saint.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X