Selfie with daughter: మోదీకి స్ఫూర్తినిచ్చిన కాన్సెప్ట్: ఓ పథకం ఆవిష్కరణకు కారణం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తోన్న రేడియో కార్యక్రమం మన్ కీ బాత్. ప్రతి నెలా చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు బ్రాడ్‌కాస్ట్ అయ్యే ప్రోగ్రామ్ ఇది. 2014లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయన దీన్ని కొనసాగిస్తూ వస్తోన్నారు. ఆ ఏడాది అక్టోబర్ 3వ తేదీన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 45 నిమిషాల నుంచి గంట పాటు రేడియో ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు.
తన 100వ ఎపిసోడ్‌లో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 32 నిమిషాల పాటు ఆయన ప్రసంగం కొనసాగింది. తొలుత- హర్యానాకు చెందిన సునీల్ అనే వ్యక్తితో మాట్లాడారు. ఆయన ప్రారంభించిన సెల్ఫీ విత్ డాటర్ అనే కాన్సెప్ట్ తనకు స్ఫూర్తినిచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ కాన్సెప్ట్‌తోనే తాను బేటీ బచావ్-బేటీ పఢావ్ పథకానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. బాలిక సంరక్షణలో ఈ కాన్సెప్ట్ అత్యద్భుతంగా పని చేస్తోందని ప్రశంసించారు.
బాలికలను చదివించాల్సిన బాధ్యతను ఇది గుర్తు చేసిందని పేర్కొన్నారు. అనంతరం ఆయన జమ్మూ కాశ్మీర్‌కు చెందిన మన్సూర్ అహ్మద్ అనే ఓ పారిశ్రామికవేత్తతో మాట్లాడారు. విశాఖపట్నానికి చెందిన మురళీ అనే వ్యక్తి పేరును మోదీ ప్రస్తావించారు. బిహార్‌లోని బేతియాకు చెందిన మరో వ్యక్తి చేసిన సేవలను గుర్తు చేశారు.

మేకిన్ ఇండియా, లోకల్ టు వోకల్.. కింద వారందరూ మణిపూర్‌కు చెందిన బిజయ్ శాంతి అనే మహిళతో మోదీ నేరుగా ఫోన్‌లో మాట్లాడారు. లోటస్ ఫైబర్ ద్వారా దుస్తుల తయారీలో ఆమె నిష్ణాతురాలిగా కీర్తించారు. హిమాలయాల్లో పేరుకుపోయిన చెత్త, ఇతర వ్యర్థాలను వెలికి తీయడానికి ప్రతిరోజూ కృషి చేస్తోన్న ప్రదీప్ అనే పర్వతారోహకుడితో ప్రధాని మోదీ మాట్లాడారు.
ఆయన చేస్తోన్న పనిని ప్రశంసించారు. పర్యావరణాన్ని కాపాడటానికి స్వచ్ఛ హిమాలయ అనే కాన్సెప్ట్‌తో ఆయన పని చేస్తోన్నారని గుర్తు చేశారు. తమ పొరుగు రాష్ట్రాల్లో ఉండే కనీసం 15 పర్యాటక కేంద్రాలను తప్పకుండా సందర్శించి తీరాలంటూ మోదీ దేశ ప్రజలకు సూచించారు. యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రే అజౌలే ప్రసంగాలను మోదీ గుర్తు చేసుకున్నారు.
2030 నాటికి పేదలకు నాణ్యమైన విద్యను అందించే దిశగా యునెస్కో అడుగులు వేస్తోందని చెప్పారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకొంటోన్న ఈ తరుణంలో వందో ఎపిసోడ్ పూర్తి కావడం తనను ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రతిష్ఠాత్మక జీ20 సమ్మిట్‌కు కూడా ఈ ఏడాదే ఆతిథ్యాన్ని ఇస్తోన్నామని గుర్తుచేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు












Click it and Unblock the Notifications