10వ తరగతి పాస్ అయిన అమ్మాయిని తల, మొండం నరికేసి చంపేశాడు, నిశ్చితార్థం చేసి !

కర్ణాటకలో పదవ తరగతి ( SSLC) ఫలితాలు నిన్ననే వెలువడ్డాయి. ఉత్తీర్ణులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు. అయితే కొడగులోని ఓ ఇల్లు మాత్రమే దుఖ వాతావరణంతో నిండిపోయింది. పదవ తరగతి పాస్ అయిన అమ్మాయిని కిరాతకంగా నరికే చంపేసి ఆమె తల, మొండం వేరు చెయ్యడం కలకలం రేపింది.

పదవ తరగతి పాస్ అయ్యానన్న ఆనందంలో ఉన్న కూతురు దారుణ హత్యకు గురి కావడంతో ఆమె తల్లిదండ్రులు ఆర్తనాదాలు చేస్తున్నారు. కర్ణాటకలోని కొడగు జిల్లా సోమవారపేట తాలూకా సూర్లబ్బి గ్రామంలో ఎస్ఎస్ఎల్సీ విద్యార్థిని దారుణ హత్యకు గురి కావడంతో ఆప్రాంతంలోని ప్రజలు ఉలిక్కిపడ్డారు. 30 ఏళ్ల యువకుడు 10వ తరగతి చదువుతున్న బాలికను అతి కిరాతకంగా హత్య చేసి ఆమె తల నరికి శరీరాన్ని ముక్కలు చెయ్యడం కలకలం రేపింది.

10th pass girl brutally hacked and beheaded by young man the next day

సూర్లబ్బి హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న యుఎస్ మీనా (17) అనే యువతిని అతి కిరాతంగా హత్య చెయ్యడంతో పోలీసులు సైతం హడలిపోయారు. సుబ్రమణి, ముత్తక్కి దంపతుల ఏకైక కుమార్తె మీనా. కూతురు మీనాను చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. మీనా సూర్లబ్బి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. మీనా పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో ఆమె తల్లిదండ్రులు సంతోషంతో గురువారం బంధువులు, స్నేహితులు అందరికి స్వీట్లు పంచిపెట్టారు.

మీనా చదువుతున్న స్కూల్ లో 100% ఫలితాలు రావడంతో ఆ పాఠశాలలో కూడా సంబరాలు చేసుకున్నారు. నిందితుడు ఓంకార అలియాస్ పాపు మీనాను దారుణంగా నరికి చేంపేశాడు. నిందితుడు ఓంకారతో మీనాకు ఇటీవల నిశ్చితార్థం జరిగింది. అయితే మీనా మైనర్ కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిశ్చితార్థాన్ని నిలిపివేసినట్లు సమాచారం. నిశ్చితార్థం తరువాత పెళ్లి ఆగిపోవడంతో ఓంకార రగిలిపోయాడని తెలిసింది.

10th pass girl brutally hacked and beheaded by young man the next day

ఎలాగైనా మీనాను చంపేయాలని ఓంకార డిసైడ్ అయ్యాడు. నిందితులు ఓంకార ఇంట్లో ఉన్న మీనాను ఆమె తల్లిదండ్రుల ముందే ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లి తరువాత కొడవలితో ఆమెను దారుణంగా నరికి చంపేశాడని పోలీసులు అన్నారు. సోమవారం పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడితో మైనర్ బాలిక మీనా నిశ్చితార్థాన్ని కుటుంబీకులు ఫిక్స్ చేసినట్లు ఎస్పీ కె.రామరాజన్ ధృవీకరించారు.

అయితే సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు మీనా కుటుంబ సభ్యులను సంప్రదించి బాలికకు 18 ఏళ్లు నిండిన తర్వాతే పెళ్లి చెయ్యాలని ఒప్పించారు. ఈ కోపంతోనే నిందితుడు ఓంకార్ నిశ్చితార్థం చేసుకున్న మీనాను హత్య చేసి ఉంటాడని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. మీనాను అతి దారుణంగా హత్య చేసిన ఓంకారకు ఎలాంటి ఫీలింగ్ లేకుండా హ్యాపీగా ఉన్నాడని పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+