మైనర్‌బాలికపై గ్యాంగ్ రేప్, 12 మంది నిందితుల అరెస్ట్

చెన్నై: అభంశుభం తెలియని పన్నెండేళ్ళ బాలికపై 11 మంది దుండగులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఎట్టకేలకు పోలీసులు ఈ దుండగులను అరెస్ట్ చేశారు.తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఈ ఘటన చోటు చేసుకొంది.

కోవై ఆనైకట్టికి ప్రాంతానికి చెందిన బాలికను అదే ప్రాంతానికి ఇందూజ అనే మహిళ ఈ నెల 19వ తేదిన తిరునాళ్ళకు తీసుకెళ్తానని అదే ప్రాంతానికి చెందిన 11 ఏళ్ళ బాలికను తీసుకెళ్ళింది. అయితే ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పలేదు.

అయితే ఎంతకీ తమ కూతురు ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పలుచోట్ల వెతికారు. ఆమె దొరకలేదు. దీంతో పోలీస్ స్టేషన్ లో బాలిక తల్లిదండ్రులు ఆగలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

12 held for rape of minor at Attappady

ఈ సమాచారాన్ని సోళయూర్ పోలీసులకు అందించారు. అగలి పోలీసులు సోళయూర్ పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు. సోళయూర్ పోలీసులు ఊరి వదిలి ఆలయ ఉత్సవాలకు భద్రత కోసం బయలుదేరారు. దారిమద్యలో ఓ గుడిసెలో ఉన్న ఇందూజతో పాటు ఉన్న బాలికను ఇందూజ అపహరించి 11 మంది యువకుల వద్ద వదిలేసింది.

బాలికపై దారుణానికి ఒడిగట్టిన వీనస్‌రాజ్, శివకుమార్, రాజేష్, కుమార్, మణికంఠన్, అరవింద్, ఈశ్వరన్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే మన్నర్ కోర్టులో వీనస్ రాజ్ పారిపోయాడు. మిగిలినవారిని కోర్టులో హజరుపర్చారు.

మైనర్ బాలికను ఇందూజ ఎందుకు తీసుకెళ్ళిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. మైనర్ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+