భారీ ఎన్‌కౌంటర్: పెద్ద ఎత్తున మావోయిస్టుల మృతి, ట్రెయినింగ్‌లో..
చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.
నయా రాయపూర్: చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇది మావోలకు గట్టి ఎదురుదెబ్బ. నారాయణపూర్ జిల్లాలోని అమ్మబేడ అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. అక్కడ మూడు రోజులుగా నక్సలైట్ల ట్రెయినింగ్ క్యాంప్ నిర్వహిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
మరికొందరు మావోయిస్టులు తీవ్ర గాయాలతో తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే, చనిపోయిన మావోయిస్టుల సంఖ్య 30 వరకు ఉంటుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

మావోలకు భారీ నష్టం జరిగిందని భావిస్తున్న పోలీసులు
చత్తీస్‌గఢ్‌లోని ఎన్‌కౌంటర్ ద్వారా మావోలకు భారీ నష్టం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం నుంచి కోబ్రా దళాలు, పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మరికొందరు పోలీసులు అక్కడకు చేరుకోవాలనుకున్న ఆ పరిస్థితి కనిపించడం లేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications