ఘోరం: 12మంది విద్యార్థినులపై హెచ్ఎంతో సహా టీచర్ల గ్యాంగ్‌రేప్
ముంబై: విద్యార్థులకు మంచి మాటలు చెప్పి సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులే కీచకలుగా మారారు. ఏకంగా 12మంది విద్యార్థులపై సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డారు. మహారాష్ట్రలోని బుల్దానాలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
హివర్ఖేడాలోని నినభావు పోక్రే ఆశ్రమ్ అనే ప్రైవేట్ పాఠశాలలోని 12మంది గిరిజన మైనర్ బాలికలపై 11మంది ఉపాధ్యాయులు ఈ ఘోరానికి ఒడిగట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 11మంది నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూడా ఉండటం గమనార్హం.

బుల్దానా ఎస్పీ మాట్లాడుతూ.. 'ఈ ఘటన దీపావళికి ముందు జరిగింది. కొందరు మహిళా పోలీసులను పంపించి బాధిత బాలికల నుంచి వాంగ్మాలాన్ని తీసుకుంటున్నాం. నిందితులను అరెస్ట్ చేశాం' అని తెలిపారు. కాగా, మహారాష్ట్ర డీజీపీ ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించి.. విచారణకు ఆదేశించారు.
#UPDATE : 11 arrested for raping a minor in Maharashtra's Buldhana
— ANI (@ANI_news) November 4, 2016
బాధిత బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. బాధిత బాలికల్లో కొందరు గర్భం దాల్చారని వారిని పరీక్షించిన వైద్యులు వెల్లడించారు. కాగా, దీపావళి రోజున బాధిత బాలికలు పండగను జరుపుకోకుండా విషాదంగా ఉండటంతో కుటుంబసభ్యులు వారిని ప్రశ్నించారు. దీంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. కాగా, ఈ ఘోరంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది.












Click it and Unblock the Notifications