వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల నుండి భారత్లోకి అక్రమంగా బంగారం.. ఒక్కనెలలో ఎంత బంగారం పట్టుబడిందంటే!!

|
Google Oneindia TeluguNews

బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల నుండి భారత్లోకి తరలిస్తున్న అక్రమ బంగారం గుట్టు రట్టు చేస్తున్నారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ పోలీసులు. ఇటీవల ఈశాన్య ప్రాంతంలో ముఖ్యంగా బంగ్లాదేశ్ మరియు మయన్మార్ సరిహద్దులో భారత్లోకి తరలిస్తున్న అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం ఊపందుకున్నట్లు తెలుస్తోంది.

భారత ఫార్మాసంస్థ దగ్గుమందు తాగి 66మంది చిన్నారులు మృతి; గాంబియా మరణమృదంగంపై డబ్ల్యూహెచ్ఓ సీరియస్భారత ఫార్మాసంస్థ దగ్గుమందు తాగి 66మంది చిన్నారులు మృతి; గాంబియా మరణమృదంగంపై డబ్ల్యూహెచ్ఓ సీరియస్

 బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దు ద్వారా భారత్ లో బంగారం స్మగ్లింగ్

బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దు ద్వారా భారత్ లో బంగారం స్మగ్లింగ్

గతంలో బంగారం స్మగ్లింగ్ కోసం పోరస్ సరిహద్దులను ఉపయోగించారు. ఇక ఇప్పుడు బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దు ద్వారా, ఈశాన్య ప్రాంతంలో స్మగ్లర్లు బంగారాన్ని తరలించేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. పాట్నా, ఢిల్లీ మరియు ముంబై లలో నిర్దిష్టమైన నిఘా ద్వారా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సరిహద్దుల్లో 33. 40 కోట్ల రూపాయల విలువైన 65. 46 కిలోల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని గోనెసంచిలో పెట్టి, దేశీయ కొరియర్ సరుకుతో కలిపి ఐజ్వాల్ నుంచి ముంబైకి బంగారాన్ని రవాణా చేసినట్టుగా గుర్తించారు.

 మయన్మార్ నుండి భారత్ కు తరలించిన 23.23 కిలోల బంగారం పట్టివేత

మయన్మార్ నుండి భారత్ కు తరలించిన 23.23 కిలోల బంగారం పట్టివేత


ఇక అదే మార్గంలో బంగారం అక్రమ రవాణా అయిన మరో కేసులో, మయన్మార్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 23.23 కిలోల బరువు ఉన్న 11.65 కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని పట్టుకున్నారు. సిలిగుడి, గౌహతి మార్గంలో వాహనాల తనిఖీలు చేపట్టిన అధికారులు వాహనాల చక్రాల మధ్య ప్రత్యేకంగా తయారు చేసిన భాగాలలో 21 బంగారు కడ్డీల నుంచి తరలించేందుకు ప్రయత్నించినట్లుగా గుర్తించారు. రెండు వాహనాలలో నలుగురు సభ్యులను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం మయన్మార్ నుండి మిజోరాం లోని జోఖౌతార్ సరిహద్దు ద్వారా భారతదేశానికి అక్రమంగా రవాణా చేయబడింది.

సెప్టెంబర్ నెలలోనే మొత్తం 11 కేసులు.. 121 కిలోల బంగారం పట్టివేత

సెప్టెంబర్ నెలలోనే మొత్తం 11 కేసులు.. 121 కిలోల బంగారం పట్టివేత


ఒక్క సెప్టెంబర్ నెలలో బంగారం అక్రమ రవాణాకు సంబంధించిన మొత్తం 11 కేసులు నమోదు అయ్యాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు . దేశంలోని ఈశాన్య ప్రాంతం నుండి దేశంలోని ఇతర ప్రాంతాలకు మొత్తం 121 కిలోల బంగారం అక్రమ రవాణా అవడానికి మయన్మార్ బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి తరలించబడింది అని గుర్తించారు. సరిహద్దుల నుండి జరుగుతున్న ఈ అక్రమ బంగారం తరలింపు వ్యవహారం పై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఈశాన్య ప్రాంతంలో జరుగుతున్న ఈ దందాపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.

English summary
In the month of September alone, DRI officials seized 121 kg of gold being smuggled into India from the borders of Bangladesh and Myanmar. 11 cases were registered in one month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X