అడవిలో విషపూరిత పండ్లను తిని 14 మంది మృతి
షిల్లాంగ్: విషపూరితమైన అడవి పళ్లు తిని అస్సాంలోని దుబ్రి జిల్లాకు చెందిన 14 మంది కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన మేఘాలయలోని తూర్పు జైనతేయ కొండల్లో చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు.
మృతి చెందిన వారంతా అస్సాంలోని దుబ్రి జిల్లా చెందిన వారిగా గుర్తించామన్నారు. సాయిపుంగ్ జిల్లాకు 15 కిలోమీటర్లు దూరంలో ఉంపంగ్ గ్రామంలో రోడ్డు నిర్మాణ పనుల నిమిత్తం వీరంతా మేఘాలయకు కూలీ పనుల కోసం వచ్చారని తెలిపారు.

ప్రాధమిక విచారణలో వీరంతా సమీపంలోని అడవిలోకి వెళ్లి విషపూరితమైన పండ్లను తిని మృతి చెందినట్లు తేలిందని జైనతేయ హిల్స్ ఎస్పీ ఎమ్‌కే ధకర్ వెల్లడించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
ఆదివారం రాత్రి విషపూరితమైన పండ్లను తిని నిద్రకు ఉపక్రమించిన వీరంతా సోమవారం తెల్లవారే సరికే చనిపోయారని పోలీసులు ధ్రువీకరించారు.












Click it and Unblock the Notifications