ఘోరం: వర్షాల దెబ్బకు విరిగి పడిన కొండచరియలు.. 14 మంది దుర్మరణం?

అరుణాచల్ ప్రదేశ్ లో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగి పడి 14 మంది దుర్మరణం పాలయ్యారు.

ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ లో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగి పడిన ఘటనలో 14 మంది జాడ తెలియకుండా పోయారు.

ఈ దుర్ఘటన పాపుంపరే జిల్లాలోని సగాలీ సబ్ డివిజన్ లో ఉన్న లాప్‌టాప్‌ గ్రామంలో జరిగింది. జోరుగా కురుస్తున్న వర్షాల దెబ్బకు ఈ గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ దుర్ఘటనలో 14 మంది గల్లంతయ్యారు.

land-slide

ప్రస్తుతం సహాయక చర్యలు జరుగుతున్నాయని, అయితే వీరు ప్రాణాలతో ఉంటారన్న ఆశలు లేవని అధికారులు సైతం తెలిపారు. ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+