కబళించిన మృత్యువు.. రోడ్డు ప్రమాదంలో బాల నటుడి మృతి

రాయ్‌పూర్ : రోడ్డు ప్రమాదంలో బాలనటుడు శివ్‌లేఖ్ సింగ్ (14) మృతిచెందారు. తల్లిదండ్రులతో కారులో వెళ్తుండగా మృత్యువు కబళించింది. అతని తల్లిదండ్రులు, మరొకరు మాత్రం గాయపడ్డారు. తమ కుమారుడు చనిపోయారని తెలిసి, పేరెంట్స్ .. బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మిగతా బాలనటులు కూడా విచారం వ్యక్తం చేశారు. సంకట్ మోహన్ హనుమాన్ అనే సీరియల్‌లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

కబళించిన ప్రమాదం
శివలేశ్ సింగ్ తన తల్లిదండ్రులో కలిసి శుక్రవారం బయల్దేరారు. బిలాస్‌పూర్ నుంచి రాయ్‌పూర్ కారు బయల్దేరింది. ఇంతలో వారి కారు ట్రాక్కును ఢీ కొంది. ప్రమాదంలో శివ్‌లేఖ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. గాయాలతో మృతిచెందాడు. అతని తల్లిదండ్రులు లేఖనా, శివేంద్ర సింగ్ గాయపడ్డారు. అయితే లేఖనా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. కారులో ఉన్న నవీన్ సింగ్ కూడా గాయపడ్డారు. అయితే ప్రమాదం తర్వాత ట్రక్కు డ్రైవర్ పారిపోయాడని ఎస్పీ అరిఫ్ షేక్ తెలిపారు.

14-year-old child actor Shivlekh Singh dies in car accident near Raipur

రాయ్‌పూర్‌లో ఇంటర్వ్యూ కోసం శివ్‌లేఖ్ వస్తోండగా రోడ్డు ప్రమాద కబళించింది. ఛత్తీస్‌గఢ్‌లోని జంగ్జిర్ చాంపా జిల్లాకు చెందిన శివ్‌లేఖ్ ముంబైలో ఉంటున్నారు. గత పదేళ్ల నుంచి అతని తల్లిదండ్రులు ముంబైలో ఉంటున్నారని వారి ఫ్యామిలీ ఫ్రెండ్ ధిరేంద్రకుమార్ శర్మ పేర్కొన్నారు. శివ్‌లేఖ్ పలు సీరియళ్లు, రియాలిటీ షోలలో నటించారు. సంకట్‌మోచన్ హనుమాన్, ససురల్ సిమ్రా కా సీరియళ్లలో నటించారు. దీంతోపాటు పలు రియాల్టీ షోలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+