చైనా కిరాతకానికి బలైపోయిన భారత జవాన్లకు శౌర్య పతకాలు -రిపబ్లిక్ డే పరేడ్‌లోనే..
భారత్-చైనా మధ్య ఐదు దశాబ్దాల శాంతికి విఘాతం కలిగిస్తూ.. సరిహద్దులో నెత్తుటేరులు పారిన ఘటనగా గాల్వాన్ ఘర్షణ చరిత్రలోకెక్కింది. రెండు దేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసిన గాల్వాన్ హింసకు సంబంధించి తాజాగా మరో కీలక అంశం వెల్లడైంది. తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయను కాపాడేందుకు చైనా సైనికులతో తలపడి అమరులైన భారత జవాన్లకు అరుదైన గౌరవం దక్కనుంది.
గాల్వాన్ లోయలో గతేడాది జూన్ 15న చైనాతో జరిగిన ఘర్షణల్లో 16వ బీహార్ రెజిమెంట్ కు చెందిన జవాన్లు 20 మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. తెలుగువారైన కల్నల్ సంతోష్ బాబు నేతృత్వంలో 16బీహార్ రెజిమెంట్ బృందం.. డ్రాగన్ బలగాలకు దీటుగా బదులిచ్చింది. ప్రాణాలకు తెగించి ప్రత్యర్థితో పోరాడిన జవాన్లకు రిపబ్లిక్ డే వేడుకల్లో కేంద్ర ప్రభుత్వం పతకాలను అందజేయనుంది.

కల్నల్ సంతోష్ బాబుతోపాటు కనీసం ఐదుగురికి శౌర్య పతకాలు అందజేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఎన్ని మెడల్స్, ఎంతమందికి అందిస్తారనే దానిపై డిఫెన్స్ మినిస్ట్రీ కచ్చితమైన వివరాలు వెల్లడించలేదు. జనవరి 26న రాజ్ పథ్ వేదికగా జరుగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అమరుల కుటుంబాలకు సదరు పతకాలను కేంద్రం అందజేయనుంది..
గాల్వాన్ లోయలో హింసాత్మక ఘర్షణ తర్వాత కాస్త వెనక్కి తగ్గినట్లు నటించిన చైనా.. మళ్లీ కొద్దిరోజులకే తన విస్తరణవాద వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. రెండు దేశాల మధ్య సైనిక, దౌత్య మార్గాల్లో జరుగుతోన్న చర్చలు వరుసగా విఫలం అవుతుండంతో 10 నెలలుగా వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.
-
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications