రిసెప్షన్‌కి వెళ్లి వస్తుండగా ప్రమాదం: 16 మంది మృతి
పశ్చిమబెంగాల్: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం మాల్దా పట్టణ సమీపంలోని 34వ నెంబరు జాతీయ రహదారిపై కారు-లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం ఉదయం 7.30 ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, సహాయక సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దినాజ్‌పూర్ జిల్లా రాయిగంజ్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా మాల్దా పట్టణ సమీపంలోకి రాగానే కారును లారీ ఢీకొట్టింది.

ఘటనా స్థలంలోనే 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరి కొంత మంది క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications