తాగుడుకు డబ్బుల్విలేదని కొడుకును పొడిచేశాడు
సహరాన్పూర్: మద్యానికి బానిస అయిన తండ్రి అదే మద్యం మత్తులో కుమారుడిని పలు సార్లు పొడిచి హత్యాయత్నం చేసిన దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని సహరన్పూర్ జిల్లాలోని దేవ్ బండ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
దేవ్ బండ్ ప్రాంతంలో బాదర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను ఏ పనీ చెయ్యడు. నిత్యం కుటుంబ సభ్యులను వేధించి డబ్బు లాక్కుని వెళ్లి మద్యం సేవించేవాడు. బాదర్ కుమారుడు అహమ్మద్ (17) చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంభానికి సహాయపడుతున్నాడు.

మంగళవారం బాదర్ మద్యం సేవించడానికి రూ. 200 ఇవ్వాలని కుమారుడు మహమ్మద్ కు చెప్పాడు. తన దగ్గర డబ్బులు లేవని, తరువాత ఇస్తానని మహమ్మద్ సమాధానం ఇచ్చాడు. అయితే బాదర్ కుమారుడి మీద మండిపడ్డాడు.
ఇద్దరి మద్య మాటామాటా పెరిగింది. తరువాత సహనం కోల్పోయిన బాదర్ కత్తెర తీసుకుని కుమారుడిని ఇష్టం వచ్చినట్లు పొడిచి అక్కడి నుంచి పరారైనాడు. మహమ్మద్ ను జిల్లా ఆసుపత్రికి తరించామని, అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications