ముంబై పేలుళ్లు: యాకూబ్ మరణశిక్ష రివ్యూ పిటిషన్ తిరస్కరించిన సుప్రీం
న్యూఢిల్లీ: 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో యాకూబ్ మెమన్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. గత సెప్టెంబర్ 26, జూన్ 2 తేదీల్లో మరణశిక్షపై రెండుసార్లు స్టే విధించిన కోర్టు, మరణశిక్షపై దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
నిరుడు యాకూబ్ మెమన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆయన నిర్ణయాన్నితెలియజేయశారు.

1993లో ముంబైలోని స్టాక్ ఎక్స్ఛేంజ్, ప్రముఖ సినిమా థియేటర్లు, రెండు పెద్ద మార్కెట్ల సమీపంలో జరిగిన 13 వరుస పేలుళ్లలో సుమారు 257 మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.












Click it and Unblock the Notifications