తప్పిన పెను ప్రమాదం: ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం,సురక్షితంగా ట్రైనీ ఐఎఎస్‌లు
Recommended Video

గ్వాలియర్: ఏపీ ఎక్స్‌ప్రెస్‌లోని రెండు ఏసీ కోచ్‌ల్లో సోమవారం నాడు ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించాయి. న్యూఢిల్లీ నుండి విశాఖ పట్టణానికి ఈ రైలు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది. రైలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ సమీపంలోకి రాగానే రెండు కోచ్ ల్లో మంటలు వ్యాపించాయి. ఫైరింజన్లు మంటలను ఆర్పివేశాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గ్వాలియర్ కు సమీపంలోని బిర్లా నగర్ రై్ల్వే స్టేషన్ వద్దకు రైలు రాగానే రైలులోని రెండు కోచ్‌ల్లో అగ్ని ప్రమాదం వాటిల్లింది. బీ6, బీ7 కోచ్‌ల్లో అగ్ని ప్రమాదం వాటిల్లింది.

ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని సమాచారం అందుతోంది. ఈ రైలులోనే సుమారు 36 మంది ట్రైనీ ఐఎఎస్‌లు ప్రయాణం చేస్తున్నారని సమాచారం. అయితే ఈ రెండు ఏసీ కోచ్ ల్లో మంటలు వ్యాపించిన విషయాన్ని గుర్తించిన ప్రయాణీకులు రైల్వే సిబ్బందికి సమాచారమిచ్చారు. రైలు బయలుదేరడనికి ముందే ఈ ఘటన చోటు చేసుకొంది.
అయితే కొందరికి స్వల్ప గాయాలైనట్టుగా అధికారులు చెబుతున్నారు. మరోవైపు రైల్వేస్టేషన్ వద్ద హైటెన్షన్ విద్యుత్ వైరు ఏసీ కోచ్‌లపై పడింది. దీంతో అగ్ని ప్రమాదం వాటిల్లిందని రైల్వే పిఆర్ఓ మనోజ్ కుమార్ ప్రకటించారు.
సంఘటన స్థలంలో నాలుగు ఫైరింజన్లు మంటలను ఆర్పివేశారు.. ఇతర బోగీలకు మంటలు వ్యాపించకుండా రైల్వే అధికారులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. మంటలు అంటుకున్న రెండు బోగీల్లో వైజాగ్‌కు చెందిన 65 మంది ప్రయాణికులు ఉన్నారు.
మరోవైపు ఈ ప్రమాదం జరగడంతో ఆ మార్గంలో నడిచే రైల్వే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.












Click it and Unblock the Notifications