వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంచు శిఖరాల్లో జవాన్లకు వెచ్చటి క్యాంపులు!

భారత్-చైనా సరిహద్దులో లడఖ్‌లోని కారాకోరం పాస్ నుంచి అరుణాచల్‌లోని జచేప్‌లా వరకు 176 సైనిక పోస్ట్‌లు ఉన్నాయి. ఈ పోస్ట్‌ల్లో కనీసం 20 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత ఉండేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

నోయిడా: భారత్-చైనా సరిహద్దులో ఇండో టిబెటన్ బార్డర్ పోస్ట్ (ఐటీబీపీ) జవాన్ల కోసం 50 ఉష్ణోగ్రత నియంత్రిత కేంద్రాలను నిర్మించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు.

హిమాలయ పర్వతాల్లో ఐటీబీపీ సిబ్బంది కొన్నిసార్లు మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో సరిహద్దులను పహారా కాయాల్సి ఉంటుందని గుర్తుచేస్తూ.. వారి కోసం ఉష్ణోగ్రత నియంత్రిత పోస్ట్‌లను నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు.

20 Degrees Round-The-Year For New Border Posts Near China

ఐటీబీపీ 56వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నోయిడాలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐటీబీపీ సిబ్బంది సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

భారత్-చైనా సరిహద్దులో లడఖ్‌లోని కారాకోరం పాస్ నుంచి అరుణాచల్‌లోని జచేప్‌లా వరకు 176 సైనిక పోస్ట్‌లు ఉన్నాయి. ఈ పోస్ట్‌ల్లో కనీసం 20 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత ఉండేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని రాజ్‌నాథ్ చెప్పారు.

మంచు తుఫానులు, శూన్య ఉష్ణోగ్రతలు ఉండే ఎత్తయిన ప్రదేశాల్లో ఈ పోస్ట్‌లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో 25 సరిహద్దు రోడ్లను నిర్మించనున్నామని తెలిపారు.

English summary
All jawans and officers of the Indo-Tibetan Border Police (ITBP) will be trained in basic Mandarin and a proposal for 50 more posts for the force along the border with China, temperature controlled at 20 degrees all year round in high-altitude is being considered by the government, Home Minister Rajnath Singh said today. He was speaking during the 56th Raising Day celebrations of the paramilitary force in Greater Noida.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X