2006 ముంబై రైలు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు-మొత్తం 12మందీ నిర్దోషులే..!

2006లో జరిగిన ముంబై రైలు పేలుళ్ల కేసులో ఇవాళ సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ట్రయల్ కోర్టు దోషులుగా నిర్ధారించి వివిధ శిక్షలు వేసిన 12 మందికీ ఈ కేసు నుంచి విముక్తి కల్పిస్తూ బోంబో హైకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. దీంతో వీరంతా జైళ్ల నుంచి విడుదల కాబోతున్నారు. అప్పట్లో తీవ్ర కలకలం రేపిన ఈ పేలుళ్ల కేసులో సుదీర్ఘ విచారణ తర్వాత ట్రయల్ కోర్టు నిందితుల్ని దోషులుగా తేల్చింది.

2006 జూలై 11న 11 నిమిషాల వ్యవధిలో ముంబైలోని పలు రైల్వే స్టేషన్లలో ఏడు బాంబు పేలుళ్లు జరిగాయి. బాంబు పేలుళ్ల నష్టం ఎక్కువగా ఉండేలా దాడులకు రిగ్డ్ ప్రెజర్ కుక్కర్‌లను వాడారు. ఆ రోజు సాయంత్రం 6.24 గంటలకు తొలి పేలుడు జరగగా..చివరిది సాయంత్రం 6.35 గంటలకు చోటు చేసుకుంది. ముంబైలోని చర్చిగేట్ నుండి వచ్చే రైళ్లలోని ఫస్ట్-క్లాస్ కంపార్ట్‌మెంట్లలో బాంబులను అమర్చారు. అవి మాతుంగా రోడ్, మహీం జంక్షన్, బాంద్రా, ఖార్ రోడ్, జోగేశ్వరి, భయాందర్ మరియు బోరివలి స్టేషన్ల సమీపంలో పేలాయి.

2006 Mumbai train blasts case Bombay high court acquitted all 12 convicts

ఈ పేలుళ్లలో 189 మంది ప్రాణాలు కోల్పోయారు. 8 వేల మంది వరకూ గాయపడ్డారు. ఈ కేసులో సుదీర్ఘ దర్యాప్తుతో పాటు విచారణ కూడా సాగింది. అనంతరం 2015లో ట్రయల్ కోర్టు.. 12 మందిని దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో వీరిలో ఐదుగురికి ఉరిశిక్షతో పాటు మిగతా వారికి జీవిత ఖైదు విధించింది. దీనిపై దోషులు బోంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును జస్టిస్ అనిల్ కిలోర్, జస్టిస్ శ్యామ్ చందక్ తో కూడిన బోంబే హైకోర్టు ధర్మాసనం విచారించింది.

దోషులకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలు సమర్పించడంతో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిందితులు నేరం చేశారని నమ్మడం కష్టమని, అందువల్ల వారి దోష నిర్ధారణను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. నిందితుల్ని మరే ఇతర కేసులోనూ లేకపోతే జైలు నుండి విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. అంతిమంగా నేరారోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనందున దోషులకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ (సందేహం యొక్క ప్రయోజనం)ఇస్తున్నట్లు బెంచ్ పేర్కొంది.

ఈ కేసు విచారణలో లోపాల్ని ప్రస్తావిస్తూ.. పేలుళ్లు జరిగిన 100 రోజుల తర్వాత ఒక వ్యక్తి నిందితుడిని గుర్తుంచుకోవడం సాధ్యం కాదని తెలిపింది. దర్యాప్తు సమయంలో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, ఆయుధాలు, మ్యాప్‌లు పేలుళ్లకు సంబంధం లేనివిగా కనిపిస్తున్నాయని తేల్చేసింది. పేలుళ్లలో ఎలాంటి బాంబులను ఉపయోగించారో కూడా ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని వ్యాఖ్యానించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+