ఆటోలోంచి లాక్కెళ్లి ట్రక్కులో యువతిపై గ్యాంగ్ రేప్

సామూహిక అత్యాచారానికి గురైన యువతి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె హౌరా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కోల్‌కతా పోలీసులు కేసు దర్యాప్తు కోసం హౌరా చేరుకున్నారు. ఆ యువతి సాయంత్రం ఏడున్నర గంటలకు తోడి ఉద్యోగులు, మిత్రులతో పాటు మాల్ నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
హాస్టింగ్స్ క్రాసింగ్ వద్ద మిగతా వాళ్లు వెళ్లిపోగా, ఆ యువతి ఇంటికి వెళ్లిపోవడానికి షటిల్ టాక్సీ ఎక్కినట్లు తెలుస్తోంది. టాక్సీ గంగానదికి ఆనుకుని ఉన్న ప్రిన్సెప్ ఘాట్‌కు చేరుకోగానే ఐదుగురు వ్యక్తులు టాక్సీని ఆపి ఆయుధంతో బెదిరించి అమ్మాయిని బలవంతంగా తీసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది.
ఆమెను నిలిచి ఉన్న ట్రక్కులోకి తీసుకుని వెళ్లి ఆమె సామూహిక అత్యాచారం జరిపినట్లు తెలుస్తోంది. ఆర్మీ బరాక్ వద్ద ఆమెను పడిసి ఆ తర్వాత పారిపోయినట్లు తెలుస్తోంది. నిందితులు ఆమె మొబైల్ ఫోన్‌ను తీసుకుని వెళ్లడంతో ఆమె ఎవరినీ సంప్రదించలేకపోయింది.
మర్నాడు ఉదయానికి ఆమెకు స్పృహ వచ్చింది. రక్తమోడుతూ ఆమె హౌరా స్టేషన్‌కు చేరుకుంది. హౌరా పోలీసులు ఆమెకు అండగా నిలిచారు.












Click it and Unblock the Notifications