కోల్‌కతాలో దారుణం: 100 ఏళ్ల వృద్ధురాలిపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో దారుణం జరిగింది. ఇరవై, ఇరవై ఒక్క ఏళ్ల యువకుడు ఓ 100 సంవత్సరాల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బెంగాల్‌లోని నడియా జిల్లాలో అర్ధరాత్రి జరిగిందని పోలీసులు తెలిపారు. ఇది కోల్‌కతాకు 65 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.
ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి జరిగిందని, నిందితుడిని గుర్తించి, అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఆమె నిద్రిస్తున్న సమయంలో ఘాతుకానికి పాల్పడ్డాడు. అర్గా బిస్వాస్ అలియాస్ అబిజిత్ ఈ ఘాతుకానికి పాల్పడగా, వృద్ధురాలి కుటుంబ సభ్యులు అతనిని పట్టుకున్నారు. మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిందితుడు గంగప్రసాద్‌పూర్‌కు చెందిన వాడు అని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టామని చెప్పారు. వృద్ధురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications