రూ. 5 కే ఫ్రీ ఇంటర్నెట్: బోనస్ గా చాయ్
బెంగళూరు/బళ్లారి: చవక డేటా ప్యాకేజీల విషయంలో నువ్వా నేనా అంటూ పోటి పడుతున్న టెలికాం కంపెనీలు ఒకరిమీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్న సమయంలో రూ. 5 లకు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నాడు ఓ సామాన్య యువకుడు.
10వ తరగతి వరకు చదివి ఆర్థిక స్థోమతలేక టీ దుకాణంతో బతుకుబండి లాగుతున్న ఆయువకుడు ఐదు రుపాయలకు టీతో పాటు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ సేవలు అందిస్తూ లాభాలు అర్జిస్తున్నాడు. ఇంత కాలం టీలు అమ్ముడు పోవడమే కష్టం అయిన తరుణంలో ఆ యువకుడు ఆలోచించిన విధానం చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటకలోని బళ్లారి జిల్లా సిరుగప్ప అనే చిన్న ఊరిలో సయీద్ ఖాదర్ బాష (23) అనే యువకుడు నివాసం ఉంటున్నారు. ఆర్థిక పరిస్థితుల దెబ్బతో 10 తరగతి వరకు చదివి తరువాత ఫుల్ స్టాప్ పెట్టాడు.

టీ దుకాణం పెట్టి కుటుంబ సభ్యులను పోషించుకుంటున్నాడు. అయితే ఉదయం 5 గంటల నుంచి రాత్రి వరకు వ్యాపారం చేసినా 100 టీలు అమ్ముడు పోవడం కష్టం అయ్యింది. తన స్నేహితులు ఎప్పుడూ చేతిలో సెల్ ఫోన్లు పట్టుకుని ఇంటర్నెట్ గురించి చర్చించడం గమనించాడు.
తరువాత సయీద్ ఖాదర్ బాష ఇంటర్నెట్ వ్యవహారంలో పట్టు సాధించాడు. స్థానిక కేబుల్ ఆపరేటర్ సహాయంతో టీ స్టాల్ కు ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నాడు. తన దగ్గర టీ తాగిన వారికి 30 నిమిషాలు ఫ్రీగా ఇంటర్నెట్ ఫ్రీ అంటూ ప్రకటన ఇచ్చాడు.
అంతే ఆ టీస్టాల్ కు యువత క్యూకట్టింది. ఉదయం 5 గంటలకు షాప్ తియ్యడం ఆలస్యం పోలో అంటు షాప్ లో తిష్ట వేస్తున్నారు. అక్కడ టీ తాగిన యువకులు ఫ్రీ ఇంటర్నెట్ ఉపయోగించుకుంటున్నారు.
తన దగ్గర టీ తాగిన వారికి సయీద్ ఖాదర్ బాష వైఫై పాస్ వర్డ్ ఉన్న కూపన్ ఇస్తున్నాడు. అయితే 30 నిమిషాల తరువాత ఇంటర్నెట్ కట్ అయిపోతుంది. చదువుకుంటున్న విద్యార్థులు ఎక్కువగా ఇప్పుడు టీ స్టాల్ కు వస్తున్నారు.
మా టీస్టాల్ లో ఇంటర్నెట్ స్పీడ్ 2 ఎంబీపీఎస్ ఉంటుందని సయీద్ ఖాదర్ బాష ప్రకటించడంతో ఇప్పుడు రోజు 600 టీలు అమ్ముడు పోతున్నాయి. ఓ గ్రామంలో ఇలాంటి ఫ్రీ ఇంటర్నెట్ ను కల్పిస్తున్న సయీద్ ఖాదర్ బాషను అభినందిస్తున్నారు.
విద్యార్థులకు, పేద వారికి ఉచితంగా ఇంటర్నెట్ సేవలుఅందిచండం చాల సంతోషయంగా ఉందని, తన వ్యాపారం పెరిగిందని సయీద్ ఖాదర్ బాష చెబుతున్నాడు. గతంలో ఇలాగే వడోదరా, ఉదయ్ పూర్ లో ఇద్దరు చాయ్ వాలలు ఉచిత ఇంటర్నెట్ ఆఫర్ పెట్టి వార్తల్లో నిలిచారు.












Click it and Unblock the Notifications