రెడీమెడ్ గార్మెంట్లలో రెండువేల కొత్త కరెన్సీ నోట్లు, ఎక్కడ దొరికాయంటే
ముంబాయి :రెడీమెడ్ దుస్తుల్లో జాగ్రత్తగా కొత్త కరెన్సీని భద్రపర్చి దుబాయికి తరలిస్తుండగా పట్టుకొన్నారు. 25 లక్షల విలువైన కొత్త కరెన్సీని ముంబాయి ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఘటన శుక్రవారం నాడు ముంబాయి ఎయిరో పోర్ట్ లో చోటుచేసుకొంది.
ఆరిఫ్ అనే ప్రయాణీకుడు రెడీమెడ్ గార్మెంట్ లలో భద్రపరిచి ఉన్న కొత్త కరెన్సీని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ముంబాయి నుండి దుబాయికి స్పైస్ జెట్ మిమానంలో దుబాయికి వెళ్తున్నాడు.

ఆరిఫ్ బ్యాగేజీలో 52 కవర్లలో జాగ్రత్తగా రెడీమెడ్ గార్మెంట్లను సర్ధారు.అయితే రెడీమెడ్ దుస్తుల మద్యలో కొత్త కరెన్సీని బయటకు కన్పించకుండా సర్ధిపెట్టారు. అట్టముక్కల మధ్యలో కొత్త రెండు వేల రూపాయాల నగదును కవర్లలో ఉంచారు.
విమానం ఎక్కేముందుకు ప్రయాణీకులను చెక్ చేసే సమయంలో అధికారులకు అనుమానం వచ్చి తనిఖీ చేస్తే ఈ విషయం వెలుగుచూసింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!