మరో దారుణం: యువతి కిడ్నాప్, కారులోనే గ్యాంగ్‌రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న యువతి(25)ని కిడ్నాప్ చేసి.. ఆపై కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు దుర్మార్గులు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వసంత్ విహార్ ప్రాంతంలో ఓ యువతి తన స్నేహితురాలితో కలిసి సినిమా చూసి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. ఈ ఘటన జరిగింది.

కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు యువతిని కిడ్నాప్ చేసి కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం పూర్వీ మార్గ్‌లో వదిలేసి వెళ్లిపోయినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
యువతితో పాటు ఉన్న ఆమె స్నేహితురాలు దుండగుల కారు నంబర్ గుర్తించడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఘటనకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, వారం రోజుల క్రితం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ 23ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసిన దుండగులు, ఆమెపై కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.












Click it and Unblock the Notifications