హై అలర్ట్: ఢిల్లీలోని బేకరీలో పేలుడు, ముగ్గురు బలి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని బేకరీలో పేలుడు చోటు చేసుకుని ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఒకరికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
తూర్పు ఢిల్లీలోని కురేజీ ప్రాంతంలో ఓ బేకరీ నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం బేకరీలో పేలుడు చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు, బాంబు నిర్వీర్యదళం, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

బేకరీ పరిసర ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లో ఎవరూ సంచరించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పేలుడుకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని పోలీసు అధికారులు అంటున్నారు.
స్వాతంత్ర దినోత్సవాల సందర్బంలో ఢిల్లీ నగరంలో హై అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు బేకరీలో పేలుడు చోటు చేసుకోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు హడలిపోతున్నారు.












Click it and Unblock the Notifications