ఐదేళ్ల బాలికపై నెలపాటు రేప్: ముగ్గురు మైనర్ల అరెస్ట్

పోలీసుల కథనం ప్రకారం.. గోవాలోని తక్కువ సామాజిక వర్గానికి చెందిన బాధితురాలిపై ఆమె ఇంటి ఇరుగుపొరుగుగా ఉండే ముగ్గురు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆ ముగ్గురు నిందితులు బాధితురాలి ఇంటికి వేర్వేరుగా వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పారు. బాధిత బాలికపై ఈ అఘాయిత్యాన్ని సుమారు నెలరోజుల పాటు నిందితులు కొనసాగించారు. తన పొత్తి కడుపులో నొప్పి వస్తుందని బాధిత బాలిక తన తల్లికి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
బాధితురాలి తల్లిదండ్రులు క్వెపమ్ పోలీసులను ఆశ్రయించి నిందితులపై ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులను అరెస్ట్ చేసి జువైనల్ హోంకు తరలించారు. తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులు 9, 12, 15ఏళ్ల వయస్సువారని చెప్పారు.
కిడ్నాపైన బాలికకు విముక్తి
సెరాంపూర్: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కిడ్నాపైన ఓ 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిని పోలీసులు కాపాడారు. కిడ్నాపునకు పాల్పడిన నిందితుడు అస్రఫ్ ఆలాంను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నవంబర్ 8న పాఠశాలకు వెళుతున్న బాలికను అడ్డగించి.. ఇంటి దగ్గర ఎమర్జెన్సీ ఉందని తన వాహనంలో ఇంటికి తీసుకెళ్తానని చెప్పాడు. దీంతో బాలిక అతనితో వెళ్లింది. మార్గమధ్యలో అతడు ఇచ్చిన బిస్కెట్ తిన్న బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.
కాగా, సాయంత్రమైనప్పటికీ తమ కూతురు ఇంటికి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బంధువులతో కలిసి గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది.
ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లిన నిందితుడు అక్కడే ఒక గదిలో బంధించాడు. కొన్ని రోజుల తర్వాత ఆ బాలిక రిష్రాలోని తన బాబాయ్‌కు కాల్ చేసి విషయం చెప్పింది. అతడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితుడు అష్రఫ్ మొబైల్ ఫోన్ సిగ్నల్ ద్వారా నవంబర్ 23న పోలీసులు అతని అడ్రస్ కనుగొన్నారు. అయితే అప్పటికే అతడు ఆ బాలికను ఢిల్లీ దాటించేశాడు. బీహార్‌లోని ఆరా ప్రాంతానికి వెళ్లిన అష్రఫ్‌ను అతని సెల్ ఫోన్ ఆధారంగా వెంబడించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను తన తల్లిదండ్రులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications