పొగమంచు: 30 కార్లు ఢీకొని నలుగురి మృతి(వీడియో)
న్యూఢిల్లీ: హర్యాలోని కర్నాల్ ప్రాంతంలో ప్రధాన రహదారిపై బుధవారం ఉదయం మంచు కారణంగా భారీ ప్రమాదం చోటుచేసుకుంది. మంచు దట్టంగా వ్యాపించడంతో ముందు వెళ్తున్న వాహనాలు కనిపించక వరుసగా దాదాపు 30 కార్లు ఒకదానినొకటి ఢీకొట్టాయి.
ఈ ప్రమాదంలో ఓ కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మరణించారు. రహదారిపై ట్రక్కు రిపేరు వచ్చి ఆగిపోవడంతో వెనుక నుంచి వచ్చిన వాహనం దాన్ని ఢీకొట్టింది.
పొగ మంచు వల్ల కనిపించకపోవడంతో ఇలా వరుసగా దాదాపు 30 నుంచి 40 వాహనాలు వరుసగా ఢీకొన్నాయని హైవే పెట్రోలింగ్ అధికారి మనోజ్ కుమార్ వెల్లడించారు. ఈ ఘటనలో లారీ పూర్తిగా దెబ్బతింది. పలు కార్లు నలిగిన లోహపు ముద్దలుగా కనిపించాయి.












Click it and Unblock the Notifications