శ్రీరామ నవమి వేడుకలో అపశృతి: మెట్లబావిలో పడిన 30 మంది, 11 మంది మృతి
ఇండోర్: శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లోని ఓ ఆలయంలో మెట్లబావి పైకప్పు కూలడంతో అందులో 30 మంది వరకు భక్తులు పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, అధికారులు బావిలో పడివారిని బయటికి తీశారు. వీరిలో పలువురికి తీవ్ర గాయాలు కాగా, 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇండోర్ పటేల్‌నగర్ ప్రాంతంలోని మహదేవ్ జులేలాల్ ఆలయంలో రామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యాయి. స్థలాభావం కారణంగా కొందరు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావి పైకప్పుపై కూర్చున్నారు.

అయితే, కొంతసేపటి తర్వాత ఆ బావి పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో దాదాపు 25 మందికిపైగా భక్తులు అందులో పడిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
VIDEO | Roof of old stepwell collapses in a temple in Indore; 25 people feared to fall (Disturbing visuals). More details awaited. pic.twitter.com/v3cuokzsks
— Press Trust of India (@PTI_News) March 30, 2023
నిచ్చెన సాయంతో భక్తులను బయటకు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటి వరకు 10 మందిని బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలపాలైన 11 మంది భక్తులు.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. బావి లోతు 50 అడుగులపైనే ఉన్నట్లు తెలుస్తోంది. బావిలో పడిన మిగితా భక్తులను కూడా బయటికి తీసేందుకు పోలీసులు, అధికారులు శ్రమిస్తున్నారు.
#WATCH | Madhya Pradesh: Many feared being trapped after a stepwell at a temple collapsed in Patel Nagar area in Indore.
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 30, 2023
Details awaited. pic.twitter.com/qfs69VrGa9
ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు. బాధితులను బావిలోంచి బయటికి తీసి వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందించాలన్నారు. క్షతగాత్రులంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications