కేరళలో కరోనా కల్లోలం: 30 వేల కేసులు.. 181 మంది మృతి
దైవభూమిలో కేరళలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. రోజు 25 వేల కన్నా తక్కువ కేసులు రావడం లేదు. మొన్న 20 వేల లోపు కేసులు రావడంతో ఊపిరి పీల్చుకునే పరిస్థితి.. కానీ నేడు అదీ పెరిగింది. మళ్లీ 30 వేల మార్క్ చేరింది. గత 24 గంటల్లో 30,196 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కరోనా బులెటిన్‌లో కేరళ ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 42,83,494కు చేరింది.

30 వేల కేసులు
గత శుక్రవారం నుంచి కేరళలో ఒక్కరోజులో 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన టెస్ట్ పాజిటివిటీ రేట్ మళ్లీ పెరిగింది. కొన్ని రోజులుగా 16 శాతం కన్నా తక్కువగా ఉన్న ఈ రేటు బుధవారం 17.63 శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో మొత్తం 1,79,295 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 40,21,456 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 2,39,480 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయని సమాచారం.

181 మరణాలు
గత 24 గంటల్లో కేరళలో 181 కరోనా మరణాలు సంభవించాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో గల మొత్తం 14 జిల్లాల్లో త్రిస్సూర్‌లో అత్యధికంగా 3,832 కరోనా కేసులు నమోదవగా.. ఎర్నాకుళం, కోజికోడ్, తిరువనంతపురం తదితర జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో 130 మంది హెల్త్ వర్కర్లు కాగా, 190 మంది రాష్ట్రం వెలుపల నుంచి వచ్చారని సమాచారం. మిగిలినవారిలో 28,617 మందికి పరిచయస్తుల ద్వారా కరోనా సోకినట్లు గుర్తించారు. 1,259 కేసుల్లో పేషెంట్లకు కరోనా ఎలా సోకిందీ ఇంకా తెలియరాలేదు.

కరోనా ప్రభావం
ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

టీకాలు
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు.
Recommended Video

డేంజరస్ డెల్టా
ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications