వాయుసేన దాడితో 300 మంది ఉగ్రవాదుల మృతి
Recommended Video

ఢిల్లీ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో భారత వాయుసేన జరిపిన దాడుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు మృతిచెందినట్టు తెలుస్తోంది. ఉగ్ర వాదుల మృతుల వివరాలను భద్రతా దళాలు ధృవీకరించాల్సి ఉంది.
దెబ్బకు దెబ్బ ..
ఈ నెల 14న పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాది ఆదిల్ ఆత్మాహుతిగా మారి తనను తాను పేల్చుకోవడంతో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు నెలకొరిగారు. దీనికి ప్రతిగా బుధవారం భారత వాయుసేన వైమానిక దాడులు చేసింది. ఉదయం 3.30 గంటలకు పీవోకేలోని బాలాకోట్ వద్ద ఉన్న జైషే మహ్మద్ శిబిరంపై జెట్ విమానాలతో దాడి చేసింది. ఈ దాడిలో మిరేజ్ 2000 యుద్ధ విమానం కూడా ఉంది. దాదాపు వెయ్యి కిలోల బాంబులతో తెగబడింది. దీంతో ఏం జరుగుతుందో తెలిసే లోపే భారత్ మెరుపుదాడి జరగడంతో చేష్టలుడిగి చూడటం పాకిస్థాన్ వంతైంది.

దాడిపై స్పందించిన పాకిస్థాన్
భారత వాయుసేన చేసిన దాడులపై పాకిస్థాన్ స్పందించింది. ముజఫర్ బాద్ సెక్టార్, బాలాకోట్ సెక్టార్ లో బాంబులు వేసినట్టు పాకిస్థాన్ ఆర్మీ అధికార ప్రతినిధి జనరల్ ఆసిఫ్ గఫూర్ తెలిపారు. ఈ దాడితో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications