Exit Polls: ఆ పార్టీ శివతాండవం, మోదీ హవా హుష్ కాకి, తంబీలతో పెట్టుకుంటే వాషౌట్ !
తమిళనాడులో సత్తా చాటుకోవాలని ఎన్డీఏ కూటమి చేసిన ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాలి. ఇక తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేతో పొత్తుకుని లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ సైతం ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవాలని ప్రయత్నాలు చేసింది. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ నాయకుల మద్దతుతో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు వస్తాయని ధీమాగా ఉంది.
తమిళనాడులో అన్నాడీఎంకేలోని ఓ వర్గం ప్రధాని నరేంద్ర మోదీతో చేతులు కలిపి ఎన్డీఏతో పొత్తు పెట్టుకుంది. ఇక నటుడు శరత్ కుమార్ పార్టీ కూడా ఎన్డీఏలో భాగం అయ్యింది. మరికొన్ని పార్టీలు కూడా ఎన్డీఏకి మద్దతు ఇవ్వడంతో బీజేపీ నాయకులకు కొంచెం ధైర్యం వచ్చింది. ఇక తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కూడా పాదయాత్రలు చేసి యువతను ఆకర్షించి బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగేలా పని చేశారు. మొత్తం మీద ఈసారి తమిళనాడులో బీజేపీకి మంచిరోజులు మొదలైనాయని ప్రజలు అంటున్నా జూన్ 4వ తేదీ అసలు మ్యాటర్ తెలుస్తుందని తమిళ తంబీలు అంటున్నారు.

తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి 36 నుండి 39 సీట్లు, బీజేపీ కూటమి 1 నుండి 3 సీట్లు గెలుస్తుందని సీఎన్‌ఎన్, న్యూస్ 18 సర్వే పేర్కొంది. మన దేశంలో మొత్తం ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. లోక్‌సభ ఎన్నికల తొలి దశ ఏప్రిల్ 19వ తేదీన జరగగా, చివరి దశ ఎన్నికలు ఈరోజు శనివారం జరిగాయి. దేశవ్యాప్తంగా 543 నియోజకవర్గాలు ఉన్నాయి.
అందులో 272 నియోజకవర్గాల్లో గెలిచే పార్టీ లేదా కూటమికి మెజారిటీ వస్తే ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయిలో బీజేపీ ఎన్డీయే కూటమి, విపక్షాల ఇండియా కూటమి మధ్య పోటీ నెలకొంది. శనివారం సాయంత్రం వివిధ సర్వే సంస్థలు, మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. దీని ప్రకారం తమిళనాడులో ఏ పార్టీ ఎన్ని సీట్లలో గెలుస్తుందన్న దానిపై సీఎన్ఎన్ న్యూస్ 18 ఓ సర్వేను ప్రచురించింది.
తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేతో పొత్తు ఉన్న ఇండియా కూటమి 36 నుండి 39 లోక్ సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని అంటున్నారు. ఎన్డీఏ కూటమి 1 నుండి 3 సీట్లు గెలుస్తుందని, అన్నాడీఎంకే కూటమి 0 నుండి 2 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తం మీద తమిళనాడులో డీఎంకే పార్టీ వార్ వన్ సైడ్ అని సీఎన్ఎన్- న్యూస్ 18 సర్వే తేల్చి చెప్పింది.
-
జగన్ 2019 నినాదం, పథకాలతో బరిలోకి విజయ్- అక్కడే బిగ్ ట్విస్ట్..!! -
BJP అధికారంలోకి వస్తే 'చేపల' నిషేధం! దీదీకి స్ట్రాంగ్ కౌంటర్ -
Noida jinx: అక్కడికి వెళ్తే పదవి పోయినట్లేనా ? సెంటిమెంట్ పై మోడీ కామెంట్స్..! -
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
కేసీఆర్, హరీశ్ ను జైలులో పెట్టిన తర్వాతే - రేవంత్ సంచలనం..!! -
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్











Click it and Unblock the Notifications