అస్సాంలోని నాగోన్‌లో భూకంపం: 4.0గా తీవ్రత నమోదు
ఈశాన్య రాష్ట్రం అస్సాంలోని నాగోన్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.0గా నమోదైందని జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది.
గౌహతి: ఈశాన్య రాష్ట్రం అస్సాంలోని నాగోన్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.0గా నమోదైందని జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. ఆదివారం సాయంత్రం 4.18 గంటల సమయంలో నాగోన్‌కు 10 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ట్విట్టర్ వేదికగా పేర్కొంది.
స్వల్ప ప్రకంపనలే కావడంతో ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సమాచారం. భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు తమ నివాసాల నుంచి బయటికి పరుగులు తీశారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కాగా, గుజరాత్ రాష్ట్రంలో కూడా శుక్రవారం రాత్రి భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతతో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయని ఎన్సీఎస్ తెలిపింది. సూరత్‌కు పశ్చిమ నైరుతి తీరాన 27 కి.మీ దూరంలో 5.2 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది.
Earthquake of Magnitude:4.0, Occurred on 12-02-2023, 16:18:17 IST, Lat: 26.10 & Long: 92.72, Depth: 10 Km ,Location: Nagaon, Assam, India for more information Download the BhooKamp App https://t.co/PjMvnoeE15 @Indiametdept @ndmaindia @DDNewslive @Dr_Mishra1966 pic.twitter.com/dEOcXXWyS0
— National Center for Seismology (@NCS_Earthquake) February 12, 2023
ఫిబ్రవరి మొదటివారంలో మణిపూర్ లోని ఉఖ్రుల్ ప్రాంతంలో ఉదయం 6.14 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.0 నమోదైంది.
ఇది ఇలావుండగా, ఇటీవల టర్కీ-సిరియాలో తీవ్రమైన భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకు సుమారు 30 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు లక్ష మంది వరకు గాయాలపాలయ్యారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications