ఉత్తరాదిన భూకంపం: పరుగులు తీసిన జనం
న్యూడిల్లీ: ఉత్తర భారత దేశంలోని ఢిల్లీతో సహాపాటు పలు రాష్ట్రాల్లో గురువారం తెల్లవారుజామున 4.30గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. ఈ ప్రకంపనలతో భయపడిన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులుతీశారు.
రిక్టారు స్కేలుపై భూకంప తీవ్రత 4.2గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. హర్యానాలోని బావల్‌కు 13 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రం ఉన్నట్లు గుర్తించారు.

భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం కలగకపోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications