ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పిల్లల హత్య
మీరట్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలు మరణించారు వారి వయస్సు నాలుగు నుంచి 15 ఏళ్ల మధ్య ఉంటుంది. వారి శవాలు సోమవారంనాడు బయట పడ్డాయి.
పిల్లల కొంతు నులిమి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తమ కుటుంబంతో పాటు వారంతా మూడు రోజుల క్రితమే నగరంలోని సామర్ గార్డెన్‌లోని ఇంట్లో చేరినట్లు తెలుస్తోంది. వారి తండ్రి జైలులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

కొన్ని కిలోమీటర్ల దూరంలో ఓ మహిళ శవం పడి ఉందని, ఆమె వారి తల్లి కావచ్చునని పోలీసులు అంటున్నారు. ఆమె వయస్సు దాదాపు 50 ఏళ్లు ఉంటుంది. అటవీ ప్రాంతంలో ఆమె శవం కనిపించింది.
ఆమె శవం ఓ పురుషుడి శవంతో పాటు కనిపించింది. వారిద్దరికి లైంగిక సంబంధం ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications