నగదు కష్టాలు: రాత్రికి రాత్రే రూ.10 నోట్లతో కారు కొన్నారు, ఇదీ సంగతి..
బ్యాంకు నుంచి రూ.10 నోట్లను పెద్ద మొత్తంలో దొంగిలించిన నలుగురు యువకులు ఆ డబ్బుతో ఓ కారును కొన్నారు. పది రూపాయల నోట్లు దొంగిలించిన వారిలో ఒకరిని పోలీసులు అరెస్టు చేసి, జైలులో పెట్టారు.
లక్నో: బ్యాంకు నుంచి రూ.10 నోట్లను పెద్ద మొత్తంలో దొంగిలించిన నలుగురు యువకులు ఆ డబ్బుతో ఓ కారును కొన్నారు. పది రూపాయల నోట్లు దొంగిలించిన వారిలో ఒకరిని పోలీసులు అరెస్టు చేసి, జైలులో పెట్టారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సహరాంపూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఓ గ్రామానికి చెందిన నాసిర్, అఫ్జల్, రాకేష్, టినులు స్నేహితులు. ఈ నలుగురు యువకులు రాత్రికి రాత్రే ఓ కారును కొనుక్కొని వచ్చారు. దీంతో విస్తుపోవడం గ్రామస్తుల వంతు అయింది. ఆ కారును వారు మొత్తం రూ.10 నోట్లతో కొన్నారు. ఈ విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.
ఇందులో పోలీసులు నాసిర్ అనే యువకుడిని అరెస్టు చేశారు. ఓ వైపు నగదు కొరతతో గ్రామస్తులు ఇబ్బంది పడుతుంటే వీరు జల్సా చేయడం, రాత్రికి రాత్రే కారు కొనడం వెనుక గల కారణాలను పోలీసులు తవ్వి తీశారు.

అయితే, వారు బ్యాంకును దోపిడీ చేసిన సొమ్ముతో విలాసంగా గడిపారు. కారును కొన్నారు. కారు కొనుగోలుకు రూ.10నోట్లను చెల్లించారు. ఈ యువకులు మలక్‌పూర్ హుస్సేన్ గ్రామానికి చెందినవారు.
గత నెల 19న ఓ బ్యాంక్‌లో వారు దొంగతనం చేశారు. మొత్తం రూ.10లక్షలు అపహరణకు గురి అయ్యాయి. అందులో 5 లక్షలు రూ.10 నోట్లు, మిగిలిన 5 లక్షలు రూ.20 నోట్ల. దీనిపై కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
పోలీసులు అరెస్టు చేసిన నాసిర్ వద్ద నుంచి రూ.50వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారిని కూడా త్వరలో పట్టుకుంటామని, మిగిలిన మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.












Click it and Unblock the Notifications